Home> తెలంగాణ
Advertisement

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌: జీఎంఆర్ ఖాతాలో మరో మైలు రాయి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌: జీఎంఆర్ ఖాతాలో మరో మైలు రాయి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌: జీఎంఆర్ ఖాతాలో మరో మైలు రాయి

శంషాబాద్: విమానాశ్రయం నిర్వహణలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ని నిర్వహిస్తోన్న జీఎంఆర్ గ్రూప్ సంస్థ మరో మైలు రాయిని సొంతం చేసుకుంది. విమానాశ్రయంలో కొత్తగా మరో 26 పార్కింగ్ స్టాండ్స్‌ని అందుబాటులోకి తీసుకురావడంలో జీఎంఆర్ గ్రూప్‌ విజయం సాధించింది. ప్రయాణికుల ప్రాంగణం భవనానికి తూర్పు దిశలో దాదాపు 65,000 చదరపు మీటర్ల వైశాల్యంలో జీఎంఆర్ గ్రూప్ ఈ పార్కింగ్ స్టాండ్స్‌ని ఏర్పాటు చేసింది. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ  విమానాశ్రయంలో మొత్తం విమానాల పార్కింగ్ స్టాండ్స్ సంఖ్య 83కి చేరింది. 10 నెలల కాలంలో ఈ 26 పార్కింగ్ స్టాండ్స్ నిర్మాణం పూర్తి చేసినట్టు జీఎంఆర్ ఓ ప్రకటనలో పేర్కొంది.

fallbacks

సాధారణ విమానాలతోపాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే జెట్ విమానాల పార్కింగ్ కోసం ఈ 26 పార్కింగ్ స్టాండ్స్ ఉపయోగపడనున్నట్టు జీఎంఆర్ తెలిపింది. C కోడ్‌కి చెందిన 22 విమానాలు, B కోడ్‌కి చెందిన 4 విమానాల పార్కింగ్ కెపాసిటీతో ఈ పార్కింగ్ స్టాండ్స్ రూపుదిద్దుకున్నాయి. 

fallbacks

ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సంస్థల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వారి లక్ష్యాలకు అనుగుణంగానే ఈ పార్కింగ్ స్టాండ్స్ నిర్మాణం చేపట్టినట్టు జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ ఎస్.జి.కే. కిషోర్, జీఎంఆర్ బిజినెస్ విభాగం చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు.

Read More