Home> తెలంగాణ
Advertisement

GHMC Mayor 2021: జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మీ, MIMతో ఫలించిన TRS వ్యూహాలు

Vijayalaxmi Gadwal Elected As GHMC Mayor 2021: జీహెచ్ఎంసీ ఎన్నికలు 2021లో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించాయి. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులు కైవసం చేసుకుంది.

GHMC Mayor 2021: జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మీ, MIMతో ఫలించిన TRS వ్యూహాలు

Gadwal Vijayalaxmi Of TRS Elected As GHMC Mayor 2021: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. అంతా ఊహించినట్లుగానే జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, బంజారాహిల్స్ కార్పొరేటర్, కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి నూతన మేయర్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్వేతామహంతి ప్రకటించారు.

అంతకుముందు నేటి ఉదయం 11 గంటల సమయం నుంచి నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం ప్రక్రియ ప్రారంభించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మొత్తం 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ పదవికి బీజేపీ నాయకురాలు, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్‌రెడ్డి నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్(GHMC Mayor Election) నిర్వహించారు. 

Also Read: GHMC Mayor Election 2021: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలు, అన్ని పార్టీల కార్పొరేటర్లను వెంటాడుతున్న భయం!

ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalaxmi) జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయం సాధించారు. అదే విధంగా ఉప మేయర్ పదవిని సైతం టీఆర్ఎస్(TRS) గెలుచుకుంది.

డిప్యూటీ మేయర్‌గా తార్నక టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతె శ్రీలత గెలుపొందారు. తొలుత డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం తీసుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా డిప్యూటీ మేయర్ పదవిని సైతం అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుచుకోవడం గమనార్హం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More