Home> తెలంగాణ
Advertisement

GHMC Elections Results 2020: మేయర్ ఎంపికలో ఎంఐఎం వైఖరి ఎటువైపు ?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోలేదు. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ తర్వాత రెండో స్థానంలో బీజేపీ నిలిచినప్పటికీ.. సొంతంగా మేయర్ పదవిని సొంతం చేసుకునే పరిస్థితి బీజేపికి లేదు.

GHMC Elections Results 2020: మేయర్ ఎంపికలో ఎంఐఎం వైఖరి ఎటువైపు ?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోలేదు. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ తర్వాత రెండో స్థానంలో బీజేపీ నిలిచినప్పటికీ.. సొంతంగా మేయర్ పదవిని సొంతం చేసుకునే పరిస్థితి బీజేపికి లేదు. దీంతో ఇక మెజారిటీ స్థానాల పరంగా మూడో స్థానంలో ఉన్న ఎంఐఎం పార్టీనే ఈసారి మేయర్ ఎంపికలో కీలక పాత్ర పోషించనుంది. 

చివరిసారి జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 99 స్థానాలు గెలుచుకోవడంతో ఎవరి సాయం లేకుండానే మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కానీ ఈ సారి పరిస్థితి అలా లేకపోవడంతో జీహెచ్ఎంసీ పాలకమండలిలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అధికారాన్ని పంచుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనే ముందు వరకు టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం.. తీరా ఎన్నికలకు వెళ్లేటప్పటికీ వ్యతిరేకమైంది. ఎన్నికల్లోనూ వేర్వేరుగా పోటీచేయడమే కాకుండా తమ ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం పార్టీనే అని టీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు కేటీఆర్ చేసిన పలు వ్యాఖ్యలను ఉద్దేశించి ఎంఐఎం నేతలు మాట్లాడుతూ.. తాము తల్చుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని సవాలు విసిరారు.

Also read : GHMC Election results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బీజేపి స్పందన..

సవాళ్లు- ప్రతిసవాళ్ల మధ్య వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ( GHMC Elections Results 2020 ) విశ్లేషిస్తే.. హైదరాబాద్ మేయర్ పదవి ( Hyderabad mayor ) కోసం మరోసారి ఆ రెండు పార్టీలు ఒక్క చోటకు రాకతప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎటొచ్చీ ఇక తేలాల్సిన విషయం ఒకటే ఉంది. అదేంటంటే.. జీహెచ్ఎంసీ పాలకమండలి ఏర్పాటులో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి ( Asaduddin Owaisi ) టీఆర్ఎస్‌ పార్టీకే ( TRS Party ) సహకరించి ఆ పార్టీకే మేయర్ స్థానాన్ని వదిలేసుకుంటారా లేక తమకే మేయర్ స్థానం కావాలని పట్టుబడుతారా అనేదే తెలియాల్సి ఉంది. 

Also read : GHMC Elections Results 2020: మేయర్ స్థానంపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More