Home> తెలంగాణ
Advertisement

GHMC Elections: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్ ప్రారంభం

గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.

GHMC Elections: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్ ప్రారంభం

GHMC Elections 2020 - re polling begins in old malakpet: హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. డివిజ‌న్‌లో ఉన్న 69 పోలింగ్ కేంద్రాల్లో ఈ రీపోలింగ్ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ( GHMC Elections 2020 ) ఎన్నిక రోజు జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ( Hyderabad Police) పకడ్భందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డివిజన్‌ ప్రాంతంలో ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. రీపోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. Also read: ID Cards For Voting: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు

అయితే.. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో సీపీఐ, సీపీఎం అభ్యర్థుల పార్టీల గుర్తులు తారుమారైన విషయం తెలిసిందే. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం గుర్తును ముద్రించడంతో పోలింగ్‌ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్‌ మలక్‌పేటలోని కేంద్రాల్లో పోలింగ్‌‌‌ను నిలిపివేయడంతోపాటు.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రీపోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ (ghmc elections exit polls) వెల్లడికానున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. Also read: GHMC Elections: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More