Home> తెలంగాణ
Advertisement

మరి కొద్ది గంటల్లో జీఈఎస్ సదస్సు ప్రారంభం

మరికొద్ది గంటల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభం కానుంది. 

మరి కొద్ది గంటల్లో జీఈఎస్ సదస్సు ప్రారంభం

మరికొద్ది గంటల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభం కానుంది. భారత అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సుకు దాదాపు 127 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. "మహిళలే ప్రథమం- అందరికీ శ్రేయస్సు" అనే నినాదంతో ఈ సదస్సు ప్రారంభమవనుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీ వద్దకు ప్రతినిధులు చేరుకున్నారు. సినీ నటుడు రామ్ చరణ్, మాజీ క్రికెటర్ రామ్ చరణ్, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర మొదలైనవారు ఈ సదస్సులో  పాల్గొని ప్రసంగించనున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈ సదస్సుకు హాజరయ్యే ఇవాంకా ప్రధాని ఫలక్‌నామాలో అందించే ప్రత్యేక విందుకు కూడా హాజరు కానున్నారు. మూడు గంటలకే వేదకకు చేరుకోనున్న ఇవాంకా తొలుత భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ని కలుస్తారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో మూడుసార్లు ఇవాంకా ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం ట్రిడెంట్ హోటల్‌లో ఆమె బస చేశారు. 

Read More