Home> తెలంగాణ
Advertisement

Ganesh Idol: ఇదేక్కడి వింత.. 75 ఏళ్లుగా నిమజ్జనానికి నోచుకొని గణనాథుడు.. ఎక్కడో తెలుసా..?

Palaj Ganesh: తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక ప్రసిధ్ద గణనాథుడు ఉన్నాడు. అక్కడ గత 75 ఏళ్ల నుంచి కూడా నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించరు. గణేష్ నవరాత్రుల్ని అక్కడ ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు.
 

Ganesh Idol: ఇదేక్కడి వింత.. 75 ఏళ్లుగా నిమజ్జనానికి నోచుకొని గణనాథుడు.. ఎక్కడో తెలుసా..?

Ganesha idol without immersion in nirmal district: మనదేశంలో వినాయక నవరాత్రుల్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించుకుంటాం. అయితే.. చాలా ప్రాంతాలలో వినాయక విగ్రహాలను నవరాత్రులతర్వాత మరల నిమజ్జనం కూడా అంతే వేడుకగా జరుపుతారు. అయితే.. ప్రస్తుతం.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోపల ఉన్న పాలజ్ అనే ప్రదేశంలో కొలువైన గణనాథుడ్ని మాత్రం అస్సలు నిమజ్జనం చేయరు. ప్రతిఏడాది గణనాథుడ్ని నవరాత్రుల్లో పూజలు చేసి, ఆతర్వాత మరల జాగ్రత్తగా ఆ గణేషుడికి ఒక గదిలో పెడతారు.

 ఏడాదికి కేవలం వినాయక నవ రాత్రులు మాత్రమే ఈ గణనాథులు దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గణేషుడు.. కర్ర రూపంలో వెలిశాడని చెప్తుంటారు. గణనాథులను దర్శించుకునేందుకు తండోపతండాలుగా భక్తులు తరలి వస్తుంటారు.

మహారాష్ట్రలోని బోకర్ తాలుకా పరిధిలో ఉన్న పాలజ్.. వినాయకుడు చాలా ఫెమస్. దేశానికి‌ స్వాతంత్ర్యం సిద్దించిన తొలి నాళ్లలలో ఈ కర్ర గణనాథునికి ప్రాణప్రతిష్టాపన జరగగా.. 75 ఏళ్లుగా చక్కు చెదరకుండా భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడు భక్తులు విశ్వసిస్తుంటారు.

1948 లో తొలిసారి ఈ కర్రగణపతిని విగ్రహాన్ని ప్రతిష్టించారు పాలజ్ మండప నిర్వహకులు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి జనాలు చనిపోతుండగా.. వినాయక చవితిరావడంతో.. తమను కాపాడాలంటూ కూడా వినాయకుడ్ని ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత గ్రామంలో నుంచి రోగాలన్ని తగ్గిపోతాయి.

అయితే..గణపయ్యను.. మట్టితో చేసిన గణనాథుడిని కాకుండా కర్రతో గణపతిని చేయించాలని సంకల్పించి.. నిర్మల్ కు చెందిన పాలకొండ గుండాజీ వర్మను సంప్రదించి కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయాలని కోరారంట. నిష్ఠతో కర్ర గణపతిని చెక్కిన గుండాజీ అనుకున్న సమయానికంటే ముందే గణనాథుని విగ్రహాన్ని తయారుచేశాడు. దీంతో  పాలజ్ గ్రామస్తులు.. ఓ చిన్న కుటీరంలో ప్రతిష్టించి నవరాత్రులు భక్తి శ్రద్దలతో పూజించడంతో, వ్యాధులన్ని పూర్తిగా మారిపోయాయి.

అప్పటి నుంచి కర్రగణేషుడిని  జాగ్రత్తగా  భద్రపరిచి.. ప్రతిసారి వినాయకనవరాత్రులలో మాత్రమే మరల పూజిస్తుంటారు. దీంతో అక్కడ ప్రజలకు మంచి జరిగిందని భావిస్తారు.  ప్రతిఏడాది పాలజ్ గణపయ్యను చూసేందుకుదేశం నలుమూలల నుంచి పాలజ్ కు గణేష్ నవరాత్రులలో తండోతండాలుగా వస్తుంటారు.

Read more: Pitru Paksha 2024: పితృ పక్షంలో అద్భుతం.. జాక్ పాట్ కొట్ట బోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..?

పాలజ్ కు గణేషుడికి..75 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయని పాలజ్ గ్రామస్తులు చెప్తున్నారు.పాలజ్ గణేషుడు.. సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. నాలుగు చేతులలో.. ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరోచేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో లడ్డు ఉంటుంది. కుడిచేత్తో ఆశీర్వదిస్తుంటారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More