Home> తెలంగాణ
Advertisement

TS Eamcet: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీఎంసెట్ కోచింగ్

Free Eamcet Coaching in TS: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇక నుంచి ప్రభుత్వమే ఫ్రీగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వనుంది. అంతేకాదు మెరిట్ పరీక్ష నిర్వహించి.. అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కూడా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు ఇలా..

TS Eamcet: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీఎంసెట్ కోచింగ్

Free Eamcet Coaching in TS: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న స్టూడెంట్స్‌కు ఉచితంగా ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. డిసెంబరులో ఇంటర్ సిలబస్ పూర్తి చేస్తామని.. జనవరి, ఫిబ్రవరిలో కళాశాలల్లోనే శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 

ఈ మెరిట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారిని ప్రతి జిల్లాలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వారీగా 50 మంది బాలురు, 50 మంది బాలికలను ఎంపిక చేయనున్నట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. ఎంపికైన స్టూడెంట్స్‌కు మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత.. ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు ఫ్రీమెటీరియల్ కూడా అందిమన్నారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఎంసెంట్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల అధికారులు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్స్‌, సిబ్బంది, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి ఉచిత కోచింగ్‌కు సన్నద్ధం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ బోర్డులో సమూల మార్పులు జరగునున్న విషయం తెలిసిందే. ఇక నుంచి ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో కూడా 20 మార్కులను ప్రాక్టికల్స్‌కే కేటాయించనున్నారు. 80 మార్కులే రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపీసీ మ్యాథ్స్-2బీలో సిలబస్ ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి కాస్త సిలబస్ తగ్గించనున్నారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రభుత కళాశాలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనూ సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేయనున్నారు. 

వచ్చే ఏడాది ఫస్ట్ ఇయర్‌కు స్టూడెంట్స్‌కు, 2024-25 విద్యా సంవత్సరంలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కు సెకెండ్ లాంగ్వేజ్ సిలబస్‌ను మార్చనున్నారు. నైతికతను పెంచే పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక నుంచి కామర్స్‌ను కామర్స్ అండ్ అకౌంటెన్సీగా పిలవనున్నారు. అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ఇక నుంచి పరీక్షల్లో మరింత వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు పరీక్షల్లో 30 మినిట్స్‌ ఎక్స్‌ట్రా టైమ్ ఇవ్వగా.. ఇక నుంచి 60 నిమిషాలకు పెంచనున్నారు. ఈ నిబంధనలు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. 

Also Read: Gujarat Exit Poll Results: గుజరాత్‌లో మళ్లీ బీజేపీకే పట్టం, పీపుల్స్ పల్స్ సర్వే

Also Read: Stunt Man Died: సినిమా షూటింగ్‌లో అపశృతి.. స్టంట్‌మ్యాన్ మృతి.. నోరు విప్పని యూనిట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More