Home> తెలంగాణ
Advertisement

Father in law murdered daughter in law : కోడలి గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన మామ.. కారణం అదే!

Father in law brutally murdered daughter in law in mancherial : మంచిర్యాల జిల్లాలో దారుణం. కోడలిని అత్యంత కిరాతకంగా హతమార్చిన మామ. కొడుకు అలా కావడానికి కోడలే కారణమని పగ పెంచుకున్న మామ.

Father in law murdered daughter in law : కోడలి గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన మామ.. కారణం అదే!

Father in law brutally murdered daughter in law in mancherial district in teangana: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడలిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు ఓ మామ. ఈ ఘటన మంచిర్యాల జిల్లా(mancherial district) కోటపల్లి మండలం (Kotapalli) లింగన్నపేటలో జరిగింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మూడు నెలల క్రితం లింగన్నపేటకు (Lingannapeta) చెందిన తిరుపతి కుమారుడు సాయికృష్ణతో.. అదే గ్రామానికి చెందిన సౌందర్య (19) తో వివాహం జరిగింది.

సౌందర్యను (soundarya) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సాయికృష్ణ. (Saikrishna) అయితే పెళ్లి అయిన రెండు నెలలకే సాయికృష్ణ ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. భర్త మృతి చెందిన తర్వాత లింగన్నపేట గ్రామంలోనే తన తల్లి వద్ద ఉంటోంది సౌందర్య.

అయితే తన కొడుకు మృతికి (son death) కోడలే కారణమంటూ సౌందర్యపై పగ పెంచుకున్నాడు సాయికృష్ణ తండ్రి తిరుపతి. (Tirupati) కోడలిని (daughter in law) ఎలా అయినా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు మామ.

Also Read : Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో

ఇవాళ ఎవరూ లేని సమయంలో సౌందర్య ఇంట్లోకి తిరుపతి వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో సౌందర్య గొంతును అతి కిరాతకంగా కోసి హతమార్చాడు తిరుపతి. పోలీసులు (Police) కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : Jayasuriya Ex Girlfriend: భార్య సెక్స్ టేప్ లీక్ చేసిన మాజీ క్రికెటర్.. ప్రతీకారం తీర్చుకునేందుకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More