Home> తెలంగాణ
Advertisement

టిడీపీకి సీతక్క గుడ్ బై !

టిడీపీకి సీతక్క గుడ్ బై !

తెలంగాణ టీడీపీలో మరో నేత గట్టి షాక్ ఇచ్చారు. మొన్నా, నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెబుతూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీతక్క ఈ ఉదయం (మంగళవారం ఉదయం)  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను జాతీయాధ్యకుడు చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆతరువాత హుటాహుటిన దిల్లీకి వెళ్లిపోయారు. 

దిల్లీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ - తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే, కాంగ్రెస్ పార్టీయే సరైంది. అందుకే నేడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దిల్లీలో రేవంత్ రెడ్డి తో పాటు సీతక్క కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ విషయమై టీటీడీపీ రాష్ట్ర నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి..!

Read More