Home> తెలంగాణ
Advertisement

ED NOTICES: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు.. ఫండ్ ఇచ్చింది నిజమేనన్న షబ్బీర్ అలీ

ED NOTICES:  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ,  సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.

ED NOTICES: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు.. ఫండ్ ఇచ్చింది నిజమేనన్న షబ్బీర్ అలీ

ED NOTICES:  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ,  సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించింది.  కేంద్ర మాజీ మంత్రి రేణుక్ చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. వీళ్లంతా నేషనల్ హెరాల్డ్ కు నిధులు సమకూర్చారని ఈడీకి గుర్తించిందని తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రశ్నించారు ఈడీ అధికారులు.

నేషనల్ హెరాల్డ్ కేసులో తనకు ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. అయితే పత్రిక నడపడానికి కొంత ఫండ్ మాత్రం తాను ఇచ్చానని షబ్బీర్ అలీ అంగీకరించారు. ఈడీ నోటీసులు వచ్చే విచారణకు హాజరవుతానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ  పత్రిక అయిన నేషనల్ హెరాల్డ్.. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచేది. నష్టాలు రావడంతో 2008లో మూత పడింది. ఈ పత్రికను తిరిన ఓపెన్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్ సంస్థకు 90 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చింది. అయినా నేషనల్ హెరాల్డ్ తెరుచుకోలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుగా ఇచ్చిన 90 కోట్ల రూపాయలను అప్పు సోనియా, రాహుల్‌ గాంధీకి చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ కు బదలాయించింది  ఏజెఎల్ . రుణానికి బదులుగా ఏజెఎల్  సంస్థ వాటాలన్నింటినీ వైఐఎల్‌కు బదలాయించింది. దీంతో ఏజెఎల్  సంస్థకు చెందిన 2 వేల కోట్ల విలువైన  ఆస్తులు కూడా వైఐఎల్ కు దక్కాయి.  ఈ మొత్తం వ్యవహారం చట్ట విరుద్దంగా జరిగిందని ఎంపీ సుబ్రమణ్య స్వామి ఢిల్లీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈడీ విచారణ జరుపుతోంది.

Read also: Raj yog: 59 ఏళ్ల తర్వాత రేపు 5 రాజయోగాలు.. ఈ 5 రాశుల వారికి గుడ్ టైమ్ స్టార్ట్..

Read also: PK TEAM: టీఆర్ఎస్ కు పీకే టీం బైబై.. కేసీఆర్ తీరే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More