Home> తెలంగాణ
Advertisement

Raja Singh: యూపీ ఓటర్లను బెదిరించారని... బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు EC నోటీసులు

BJP MLA Raja Singh: యూపీ ఓటర్లను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించారని పేర్కొంటూ...ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. 
 

Raja Singh: యూపీ ఓటర్లను బెదిరించారని... బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు EC నోటీసులు

EC Notice to BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో.. ఆ రాష్ట్ర ఓటర్లను ఉద్దేశిస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో రాజాసింగ్ (BJP MLA Raja Singh)  చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. యూపీ ఓటర్లపై రాజాసింగ్‌ బెదిరింపులకు పాల్పడినందుకు రాజా సింగ్ కు ఈసీ (Election commission of India) నోటీసులు పంపింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

''త్వరలో జరగబోయే యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఒక్కటవ్వాలి. ఎలక్షన్ అనంతరం యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. బీజేపీకు ఓటువేయని వారి ఇళ్లకు బుల్డోజర్లను పంపిస్తాం''..అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో రెండోదశ పోలింగ్ (UP Polls 2022) సోమవారం ముగిసింది. ఫిబ్రవరి 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మిగిలిన దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 

 యూపీ ఎన్నికలపై రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. జోకర్‌ వచ్చాడంటూ కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. కేటీఆర్ ట్వీట్ కు రాజాసింగ్ రిప్లై ఇచ్చారు. అసెంబ్లీలో మాట ఇచ్చి తప్పిన వ్యక్తి జోకర్‌ అంటూ ట్విటర్‌లో ఘాటు కౌంటర్ ఇచ్చారు. 

Also Read: Uddhav Thackeray-KCR: తెలంగాణ సీఎంకు ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌... ముంబై రావాలని ఆహ్వానం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More