Home> తెలంగాణ
Advertisement

‘దళిత బంధు' నిధులు విడుదల... ఎవరి అకౌంట్లో పడతాయో తెలుసా!

'దళిత బంధు’ పథకానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం రూ.500 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ పథకం ఎవరెవరకి వర్తిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
 

‘దళిత బంధు' నిధులు విడుదల... ఎవరి అకౌంట్లో పడతాయో తెలుసా!

Dalit Bandhu: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు(Dalit Bandhu ) పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే దీని లక్ష్యం. మహిళల పేరుమీద ఈ నగదును జమ చేయనుంది.

దళితబంధు పథకం(Dalit Bandhu Scheme) అమలులో భాగంగా.. మెుదటగా వాసాలమర్రికి నిధులు ఇచ్చారు. తర్వాత కేసీఆర్ సర్కారు(CM KCR) కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్(Huzurabad)కు రూ.500 కోట్లు నిధులు విడుదల చేసింది. దీని ద్వారా 5వేల మందికి ప్రయోజనం కలగనుంది. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా యంత్రాగం కసరత్తు ప్రారంభించింది. నిధులు తొలుత హుజూరాబాద్(Huzurabad) కే వినియోగిస్తామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం.. 20,929 కుటుంబాలున్నట్లు తేల్చింది. మళ్లీ ఇందులో నుంచి లబ్ధిదారులను వడపోయనున్నారు.

Also Read:  దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే: మంద కృష్ణ మాదిగ 

జాబ్ ఉంటే వర్తించదు..

ప్రభుత్వ కొలువు ఉన్న కుటుంబానికి ఈ పథకం వర్తించదు. దళిత బంధు(Dalit Bandhu ) ను సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అర్హులైన వారు నమోదు చేసుకునేలా చూ డటం వారు అనువైన వ్యాపారం ఎంచుకోవడంలో సహకరిండం ఈ కమిటీల బాధ్యత. 

లబ్ధిదారుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు అందజేసి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందేలా చూస్తారు. ఈ మేరకు ఎంపిక చేసిన దళిత కుటుంబంలో మహిళా పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తారు. లబ్ధిదారులు చేయాల్సిన వ్యాపారానికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలతో జాబితా రపొందించినట్లు సమాచారం.  ఏ వ్యాపారం చేయాలనే దానిపై లబ్ధిదారుడిదే తుది నిర్ణయం. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల వివరాలను డేటాబేస్‌లో పొందుపరుస్తారు.

Also Read: వాసాలమర్రిలో దళితులకు రేపే దళిత బంధు డబ్బులు: సీఎం కేసీఆర్

ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మొదలు, పరిశీలన, అర్హత నిర్ధారణ, ఆర్థిక సాయం అందజేత తదితర ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే కొనసాగనుంది. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సీజీజీ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రపొందించింది. దీనికి సవంతరంగా యాప్‌ను కూడా తయారు చేసింది. ప్రస్తుతం ఇది ప్రయాగదశలో ఉంది. వీలైనంత త్వరలో వెబ్‌పోర్టల్‌తోపాటు యాప్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు లబ్ధి పొందని కుటుంబానికి ఈ పథకంలో తొలి ప్రాధాన్యతనివ్వనున్నారు. అదే విధంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్న భమి లేని పేద కుటుంబాన్ని ఎంపిక చేయనున్నారు.

హుజూరాబాద్‌లో సంబరాలు
దళితబంధు(Dalit Bandhu) నిధులు విడుదల చేయడంతో హుజూరాబాద్‌(Huzurabad) నియోæజకవర్గ దళిత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులు రుణపడి ఉంటారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌(TRS) పార్టీ కార్యాలయంలో సంబరాలు చేశారు. డప్పు చప్పుళ్లతో రంగులు చల్లుకున్నారు. బాణాసంచా కాల్చా రు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More