Home> తెలంగాణ
Advertisement

CPI Narayana: ఆయనో పెద్ద క్రిమినల్..ఎంతో మందిని హత్య చేయించారు..అమిత్ షాపై సీపీఐ నారాయణ ఫైర్..!

CPI Narayana: తెలంగాణలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. మునుగోడులో బీజేపీ సభ తర్వాత మరింత హీటెక్కాయి. ఈక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

CPI Narayana: ఆయనో పెద్ద క్రిమినల్..ఎంతో మందిని హత్య చేయించారు..అమిత్ షాపై సీపీఐ నారాయణ ఫైర్..!

CPI Narayana: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ ఫైర్ అయ్యారు. ఆయనో పెద్ద క్రిమినల్. ఓ కేసులో 12 మంది సాక్షులను, లాయర్లను షా హత్య చేయించారని విమర్శించారు. అలాంటి క్రిమినల్ మనకు హోం మంత్రిగా ఉన్నారని మండిపడ్డారు. చెప్పులు మోస్తూ బీజేపీ నేతలు చప్రాసీ పనులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి నేతలు తనను విమర్శించడం ఏంటని అన్నారు. 

వారి బతుకు ఏంటో తమకు అర్థమయ్యిందన్నారు. చప్రాసీ పనులు చేసే బీజేపీ నేతలు..లెఫ్ట్ పార్టీ నాయకులను విమర్శించడం సరికాదన్నారు సీపీఐ నారాయణ. బీజేపీని ఓడించేందుకు దెయ్యంతోనైనా కలిసి పోరాడుతానని స్పష్టం చేశారు. ఇందుకోసం కేసీఆర్‌తోనైనా కలుస్తాం..ఇంకెవరితోనైనా కలుస్తామన్నారు. కమలం పార్టీని ఓడించేందుకు అన్నివిధాలుగా పోరాడుతామని తేల్చి చెప్పారు. 

కమ్యూనిస్టు పార్టీ నేతలమంతా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. తమను విమర్శించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో దేశంలో ధ్వంసమవుతోందన్నారు. వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలపై ఈడీ, సీబీపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ నేతలంతా బ్లాక్‌ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

బీజేపీ నేతల బానిస బుద్దికి చెప్పులు మోసుకుంటూ తిరగండి తప్ప..శక్తికి మించి మాట్లాడకండి అని ఫైర్ అయ్యారు. మునుగోడులో నిన్న సమరభేరీని బీజేపీ నిర్వహించింది. సభ వేదిక ద్వారా కమ్యూనిస్టు పార్టీలు, సీపీఐ నారాయణపై బీజేపీ నేతలు మండిపడ్డారు. సీపీఐకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని..అందుకు నీతి తప్పి టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. దీనిపై సీపీఐ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నారాయణ కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల కాంగ్రెస్, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం ఆమోదించారు. దీంతో మునుగోడు స్థానం ఖాళీ అయ్యింది. త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. మునుగోడులో టీఆర్ఎస్, సీపీఐ కలిసి పనిచేయబోతున్నాయి. దీంతో బీజేపీ, సీపీఐ మధ్య వార్ నెలకొంది.

Also read:Asia Cup 2022: మరో ఐదు రోజుల్లో ఆసియా కప్..కోహ్లీ ఫామ్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..! 

Also read:CM Jagan: పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేలా చూడండి..ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More