Home> తెలంగాణ
Advertisement

Telangana: 1000 దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నిత్యం 2 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మరణాలు సైతం దాదాపు పది వరకు ఉంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య (COVID19 deaths in Telangana) 1000 దాటింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Telangana: 1000 దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) భారీగా నమోదవుతున్నాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,159 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కోవిడ్19 కేసుల సంఖ్య (CoronaVirus cases in Telangana) 1,65,003కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య వెయ్యి (COVID19 deaths in Telangana) దాటింది. ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి తెలంగాణలో 1005 మంది చనిపోయారు. Telangana: అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య 1,33,555కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 30,443 యాక్టివ్ కేసులుండగా.. మరో 23,674 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ 23,29,316 (23 లక్షల 29 వేలు) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  Bigg Boss Telugu 4: ‘నా ఫిగర్‌ను కూడా వదల్లేదు.. దమ్ముంటే ఆమెతో ట్రై చెయ్’ 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Read More