Home> తెలంగాణ
Advertisement

Telangana Covid-19: కొత్తగా 997 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ రోజురోజుకూ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో 1500లకు పైగా నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. తాజాగా వేయికి చేరువలో కేసులు నమోదయ్యాయి.

Telangana Covid-19: కొత్తగా 997 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ రోజురోజుకూ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో 1500లకు పైగా నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. తాజాగా వేయికి చేరువలో కేసులు నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో గురువారం ( నవంబరు 12న) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,55,663 కి చేరగా.. మరణాల సంఖ్య 1,397 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Apsara Rani: అందచందాలతో పిచ్చెక్కిస్తున్న అప్సర..

అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,222 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,37,172 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 17,094 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.76 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Asif Basra: మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య

ఇదిలావుంటే.. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 42,163 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 12వ తేదీ వరకు మొత్తం 48,12,167 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 169 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

fallbacks\

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Read More