Home> తెలంగాణ
Advertisement

Covid-19: తెలంగాణలో 2,278 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు నిత్యం రెండువేలకుపైగా నమోదవుతూ.. పెరుగుతూనే ఉన్నాయి.

Covid-19: తెలంగాణలో 2,278 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు నిత్యం రెండువేలకుపైగా నమోదవుతూ.. పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. గత 24 గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 11న ) తెలంగాణలో కొత్తగా 2,278 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించారు. ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,54,880కి పెరగగా.. ఇప్పటివరకు కరోనాతో 950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,005 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 1,21,955 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. Also read: Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా.. శుక్రవారం 62,234 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 20,78,695 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 78.7 శాతం ఉండగా.. మరణాల రేటు 0.61 శాతం ఉంది. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి.. Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..

fallbacks

 Also read: Kim Jong-un: నార్త్ కొరియాలో అరాచకం.. కరోనా వ్యాపించకుండా కాల్చివేత ఉత్తర్వులు!

Read More