Home> తెలంగాణ
Advertisement

Covid-19: తెలంగాణలో 900 దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిరంతరం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Covid-19: తెలంగాణలో 900 దాటిన కరోనా మరణాలు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిరంతరం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. గత 24 గంటల్లో సోమవారం ( సెప్టెంబరు 7న ) తెలంగాణలో  కొత్తగా 2,392 కరోనా కేసులు నమోదు కాగా.. 11 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163కి పెరగగా.. ఇప్పటివరకు మరణాల సంఖ్య 906 కు చేరినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 31,670 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 1,12,587 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. Also read: Indira Gandhi Prize: డేవిడ్‌ బోరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

ఇదిలాఉంటే.. నిన్న 60,923 కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 18,27,905 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 77.5 శాతం ఉండగా.. మరణాల రేటు 0.62 శాతంగా ఉంది. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..

fallbacks

Also read: India-China standoff: భారత్-చైనా సైన్యం మధ్య కాల్పులు..!

Read More