Home> తెలంగాణ
Advertisement

Telangana Covid-19: కొత్తగా 661 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి వేయికి చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. శనివారం భారీగా తగ్గాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య తాజాగా మరింత పెరిగింది.

Telangana Covid-19: కొత్తగా 661 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి వేయికి చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. శనివారం భారీగా తగ్గాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య తాజాగా మరింత పెరిగింది. గత 24 గంటల్లో ( నవంబరు 14న ) రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా 661 కరోనా కేసులు మాత్రమే నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,57,374 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,404 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

అయితే గత 24 గంటల్లో కరోనా (Covid-19) నుంచి 1,637 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,40,545 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 15,425 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.46 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Telangana: గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు

ఇదిలావుంటే.. శనివారం తెలంగాణ వ్యాప్తంగా 21,264 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 14వ తేదీ వరకు మొత్తం 48,74,433 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  హైదరాబాద్ పరిధిలో 167 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. Also read: Amyra Dastur: మతిపోగొడుతున్న అమైరా..

fallbacks

Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Read More