Home> తెలంగాణ
Advertisement

తెలంగాణలో నేటి నుంచి మళ్లీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ షురూ

Coronavirus first dose vaccine in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 40.18 లక్షల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి. మరో 76.83 లక్షల మంది సింగిల్ డోస్ పూర్తి. ఇంకా ఫస్ట్ డోస్ కూడా తీసుకోని వారి సంఖ్య దాదాపు కోటి 43 లక్షల మంది వరకు ఉన్నట్టు సమాచారం.

తెలంగాణలో నేటి నుంచి మళ్లీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ షురూ

Coronavirus first dose vaccine in Telangana: హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం సెకండ్ డోస్ తీసుకునే వాళ్లకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తుండగా, నేటి నుంచి ఫస్ట్ డోస్ తీసుకునే వాళ్లకు కూడా మళ్లీ అవకాశం కల్పిస్తున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద సుమారు 10 లక్షల మేరకు కరోనా వ్యాక్సిన్ డోసు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అందుకే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ (First shot) ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జులై నెల చివరి వారం నుంచే 21 జిల్లాల్లో కరోనావైరస్ ఫస్ట్ డోస్ ఇవ్వడం ఆపేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 40.18 లక్షల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కాగా మరో 76.83 లక్షల మంది సింగిల్ డోస్ తీసుకుని సెకండ్ డోస్ (second dose) కోసం వేచిచూస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ఆగస్టు నెల చివరినాటికల్లా దాదాపు 40 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఇంకా ఫస్ట్ డోస్ కూడా తీసుకోని వారి సంఖ్య దాదాపు కోటి 43 లక్షల మంది వరకు ఉన్నట్టు సమాచారం.

Also read : Single dose vaccine: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌కు ఇండియాలో అనుమతి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా వ్యాక్సినేషన్:
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో (GHMC) మొత్తం 90.3 లక్షల జనాభా ఉండగా అందులో 18 ఏళ్లు నిండిన వాళ్లు 55.75 లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 14.16 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకోగా మరో 32.63 లక్షల మంది సింగిల్ డోసు తీసుకున్నారు. ఇప్పటివరకు ఫస్ట్ డోస్ తీసుకోని వాళ్లు 9 లక్షల మంది వరకు ఉన్నారు. ఏదేమైనా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సినేషన్ (Corona vaccination) వేగంగానే జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

ఆయా జిల్లాల్లో ఇంకా తగ్గని కరోనా కేసులు:
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) ప్రభావం ఇంకా తగ్గలేదు. ఆ మూడు జిల్లాల్లో ఇప్పటికీ కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆ జిల్లాలకు ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది. అలాగే ములుగు, నారాయణపేట్, గద్వాల్ వంటి మారుమూల జిల్లాల్లో కరోనావైరస్ వ్యాక్సినేషన్ (COVID-19 vaccination) ప్రక్రియ వెనుకబడినట్టు తెలుస్తోంది. దీంతో కరోనావైరస్ థర్డ్ వేవ్ (Corona third wave) రాకముందే కరోనా టీకాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు హెల్త్ డైరెక్టర్ డా శ్రీనివాస రావు తెలిపారు.

Also read : Delta variant cases in Telangana: డెల్టా వేరియంట్ కేసులు, కరోనా థర్డ్ వేవ్‌పై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరికలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More