Home> తెలంగాణ
Advertisement

Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే అనిపించి.. మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) భారీగా పెరిగాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే అనిపించి.. మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) భారీగా పెరిగాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కోవిడ్19 కేసుల సంఖ్య (CoronaVirus cases in Telangana) 1,60,571కి చేరింది. గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య (COVID19 Deaths In Telangana) 984కి చేరింది.

రాష్ట్రంలోని మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య 1,29,1877కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 30,400 యాక్టివ్ కేసులుండగా.. మరో 23,534 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా 2,180 మంది ఒకేరోజు కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

Read More