Home> తెలంగాణ
Advertisement

Telangana: కొత్తగా 2,256 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నిత్యం 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

Telangana: కొత్తగా 2,256 కరోనా కేసులు

Covid-19 cases: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నిత్యం 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 14మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 615మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1091మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ప్రభుత్వం (TSGovt) తెలిపింది. Also read: Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి

ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 54,330 మంది కోలుకున్నారు. గత 24గంటల్లో అత్యధికంగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 464 కేసులు నమోదు కాగా.. వరంగల్‌ అర్బన్ జిల్లాలో‌ 187, మేడ్చల్ జిల్లా‌లో 138, కరీంనగర్‌ జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..

fallbacks

Also read: Air India Flight Crash: 20కి చేరిన మృతుల సంఖ్య

Read More