Home> తెలంగాణ
Advertisement

Revanth Reddy Comments on KCR: కేసీఆర్ ఇలాకాలో TRSను ఓడిస్తాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య రాజకీయ వివాదం ఇంకా కొనసాగుతోంది. 

Revanth Reddy Comments on KCR: కేసీఆర్ ఇలాకాలో TRSను ఓడిస్తాం: రేవంత్ రెడ్డి

గజ్వేల్: ‘ఓటుకు నోట్లు’ కేసుతో రాజుకున్న రాజకీయ వివాదం తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే అధికార టీఆర్ఎస్ పార్టీని ఒడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం (జనవరి 7న) గజ్వేల్ - ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల భేటీలో రేవంత్ మాట్లాడారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎన్నికల్లో తమదే విజయమని పేర్కొన్నారు.

కేసుల పేరుతో విపక్షాల నేతలను పోలీసులు భయపెట్టే యత్నం చేస్తున్నారని, దీనివెనుక ఎవరున్నారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పరిపాలనను కేసీఆర్ గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. కేవలం తన కుటుంబ సభ్యులకు పదవులపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని విమర్శించారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. గత ఓటములను పట్టించుకోకుండా, భవిష్యత్ విజయాలపై ఆలోచన చేయాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి కేసీఆర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్‌లో కాంగ్రెస్‌ను గెలిపించుకుని టీఆర్ఎస్ అధినేతపై రేవంత్ ప్రతీకారం తీర్చుకుంటారా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Read More