Home> తెలంగాణ
Advertisement

అదే కానీ జరిగితే, శాసన మండలిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ?

అదే కానీ జరిగితే, శాసన మండలిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ?

అదే కానీ జరిగితే, శాసన మండలిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ?

హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 సీట్లు మాత్రమే గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత మండలిలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అప్పటివరకు ఆ పార్టీలో వున్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు సీఎల్పీని వీడి టీఆర్ఎస్ఎల్పీలో విలీనం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలిలో మిగిలింది షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు మాత్రమే. దీంతో శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఈ అనుకోని షాక్ తో తీవ్రంగా నష్టపోయామన్న ఆవేదనలో వున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే మరో ఇబ్బంది ఎదురుకానుంది. ప్రస్తుతం మండలిలో వున్న ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా మార్చి 29తో ముగియనుండగా ఆ తర్వాత మండలిలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది.

మార్చి 12న ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం గెలవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా ప్రస్తుతం ఆ పార్టీకి కేవలం 19 మంది మాత్రమే వున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ మిత్రపక్షంగా నిలిచిన టీడీపీకి రెండు ఎమ్మెల్యే స్థానాలు వున్నప్పటికీ.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారనే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ టీడీపీ అధినేత చంద్రబాబుతో ఢిల్లీలో వున్న తమ అధిష్టానం చర్చలు జరిపితే ఫలితం కనిపించే అవకాశాలు వున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నప్పటికీ అది ఎంత వరకు సాధ్యపడుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. 

ఇంత క్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయినట్టయితే, మండలిలో ఆ పార్టీ మనుగడ కోల్పోవడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Read More