Home> తెలంగాణ
Advertisement

Revanth Reddy: పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.

Revanth Reddy: పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ( MP Revanth Reddy ) అన్నారు. తాను ప్రియాంక గాంధీ వర్గంలో ( Priyanka Gandhi team ) చేరానని వస్తున్న కథనాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఎలాంటి ఆధారాలు లేకుండా జరిగే ప్రచారానికి, వదంతులకు ఎలాంటి విలువ ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విటర్‌ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. Also read : IPL 2020 logo: ఐపిఎల్ 2020 కొత్త లోగో వచ్చేసింది

తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రపన్నిన ( Political rivalries ) వారే ఇలా తనకు వ్యతిరేక వదంతులు వ్యాపింపచేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏదేమైనా.. కాంగ్రెస్‌ పార్టీలో వర్గాలకు తావు లేదని, కింది స్థాయి కార్యకర్త నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడి వరకు అందరూ ఒక్కటేనని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. తన ఎదుగుదలను ఓర్చుకోలేనివారే ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దురుద్దేశపూర్వకంగా వదంతులు వ్యాప్తి చేస్తే ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తన రాజకీయ ప్రత్యర్థులను రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. Also read : 

Read More