Home> తెలంగాణ
Advertisement

Srisailam fire accident: సీబీఐ విచారణ కోరుతూ మోదీకు లేఖ రాసిన రేవంత్ రెడ్డి

శ్రీశైలం విద్యుత్ కేంద్రం )( Srisailam power plant ) ప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ..సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

 Srisailam fire accident: సీబీఐ విచారణ కోరుతూ మోదీకు లేఖ రాసిన రేవంత్ రెడ్డి

శ్రీశైలం విద్యుత్ కేంద్రం( Srisailam power plant ) ప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ..సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్  ( Srisailam left canal ) జల విద్యుత్ కేంద్రంలో ( Power plant ) అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. కానీ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Congress mp revant reddy ) మాత్రం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై ( Kcr government ) తీవ్రంగా ఆరోపణలు చేశారు. ప్రమాదంపై సీబీఐ విచారణ ( CBI probe ) జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాద సంకేతాలపై సిబ్బంది లేఖ రాసినా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. డ్యాం భద్రత, విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై గత కొన్నేళ్లుగా ఆందోళన ఉందన్నారు. వీటన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వ పెడచెవిన పెట్టిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 9 మంది మరణం, వేల కోట్ల జాతి సంపదకు నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. Also read: TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..

Read More