Home> తెలంగాణ
Advertisement

CM Revanth reddy: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి... శాంతి భద్రతలపై డీజీపీకి సంచలన ఆదేశాలు.. డిటెయిల్స్..

CM Revanth reddy orders to dgp: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తెలంగాణలో కొంత మంది కావాలని లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

CM Revanth reddy: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి... శాంతి భద్రతలపై డీజీపీకి సంచలన ఆదేశాలు.. డిటెయిల్స్..

Cm revanth reddy serious on law and order issue: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద్రాబాద్ లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలపై స్పందించారు. ఈ క్రమంలో డీజీపీతో మాట్లాడి సంచలన ఆదేశాలు జారీచేశారు. ఇటీవల హైదరాబాద్ లో ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీల సవాళ్లు , ప్రతిసవాళ్లతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కేయి. ఈ క్రమంలో.. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి.. అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి.. బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామంటూ కూడా ప్రకటించారు. దీంతో తెలంగాణ లో వివాదంగా మారింది.

మరోవైపు.. అరికేపూడి గాంధీ సైతం.. పాడి కౌశిక్ రెడ్డి అన్ని బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నాడని, అతనువచ్చాక  పార్టీ అంతా భ్రష్టుపట్టుకుపోయిందని విమర్శించారు. చస్తానని బెదిరించి, సానుభూతితో గెలిచిన వాడు.. తన గురించి మాట్లాడటమేటని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం పీక్స్ కు చేరింది.

ఏకంగా నిన్న.. మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు కీలక నేతల్ని సైతం పోలీసులు అరెస్టులు చేశారు. సీపీ కార్యాలంలో కూడా తోపులాట సైతం జరిగింది. ఈక్రమంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు వినాయక నిమజ్జంన కూడా ఉండటంతో రేవంత్ రెడ్డి వరుస ఘటనలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాలు.. 

హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు కావాలని లాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూను క్రియేట్ చేస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ముఖ్యంగా.. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా కుట్రలకు తెరలేపుతున్నారని రేవంత్ మండిపడ్డారు. అందుకే తెలంగాణలో కావాలని సమస్యల్ని క్రియేట్ చేస్తున్నారని అన్నారు.

Read more: Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..

ఇదిలా ఉండగా..  రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి జితేందర్ కు సీఎం రేవంత్ ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని ఉన్నతాధికారులతో..  పోలీస్ యంత్రాంగంపై  రివ్యూ ఉన్నట్లు తెలుస్తోంది.  శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకొవాలని కూడా సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More