Home> తెలంగాణ
Advertisement

TS Formation Day 2024: గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టీ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..

Governor CP Radhakrishnan: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టీ విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధ కృష్ణన్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
 

 TS Formation Day 2024: గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టీ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..

Cm Revanth reddy, mallu bhatti vikramarka meets with TS Governor: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క శనివారం రాజ్ భవన్ కు వెళ్లారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించడానికి వెళ్లారు.  ఈనేపథ్యంలో ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను సీఎం, డిప్యూటీ సీఎం గవర్నర్ సీపీ రాధ కృష్ణన్  కు అందజేశారు. ప్రత్యేకంగా శాలువాను కప్పి, పుష్పగుచ్ఛం సైతం అందజేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్  చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్.. ఈసీ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు.

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఉత్సవాలు కావడంతో రేవంత్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాకుండా..  తెలంగాణ ఉత్సవాలకు ఢిల్లీకి వెళ్లి మరీ అగ్రనాయకులు సీఎం రేవంత్ ఆహ్వనం పలికారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాను .. రేవంత్ ప్రత్యేకంగా వెల్ కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణను ఇచ్చిన తల్లిగా.. రావాల్సిందిగా రేవంత్ కోరినట్లు సమాచారం. 

అదే విధంగా అనేక మంది కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ వేడుకలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ ప్రత్యేకంగా కోరారు.  సోనియా గాంధీ సైతం.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు హజరువుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక మరోవైపు జూన్ 2 న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, ఇతర ఉత్సవాలకు ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు జరిగిపోయాయి. 

గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపం వద్ద మొదటగా సీఎం రేవంత్ నివాళులు అర్పించనున్నారు. అదే విధంగా సాయంత్రం ట్యాంక్ మీద  లెజర్ షో ఉండనుంది. దీనితో పాటు కవులు, కళాకారులతో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ తన ప్రత్యేక సలహాదారుతో ఆహ్వనం అందజేయాలని చెప్పిన విషయం తెలిసిందే. 

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

తెలంగాణలోని కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమ కారులు, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వన పత్రాలు ఇప్పటికే అందజేసినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More