Home> తెలంగాణ
Advertisement

KCR MEETINGS: జాతీయ రాజకీయాలపై కన్ఫ్యూజన్ లో కేసీఆర్? రైతు సంఘాల నేతలతో ఎందుకీ టాక్స్?

KCR MEETINGS: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గందరగోళంలో ఉన్నారా? బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన వెనక్కి తగ్గారా? అంటే ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై హడావుడి చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.

KCR MEETINGS: జాతీయ రాజకీయాలపై కన్ఫ్యూజన్ లో కేసీఆర్? రైతు సంఘాల నేతలతో ఎందుకీ టాక్స్?

KCR MEETINGS:  జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గందరగోళంలో ఉన్నారా? బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన వెనక్కి తగ్గారా? అంటే ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై హడావుడి చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.  ఢిల్లీలో రోజుల తరబడి మకాం వేస్తున్నారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతాననే సంకేతం కూడా ఇచ్చారు గులాబీ బాస్. దీంతో భారతీయ రాష్ట్ర సమితీ ( బీఆర్ఎస్ ) పేరుతో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం సాగింది. బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందనే వార్తలు వచ్చాయి. కాని తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారు. కొత్త పార్టీ కాదు కొత్త కూటమి అనే వార్తలు టీఆర్ఎస్ వర్గాల నుంచి వచ్చాయి. అయితే ఆ విషయంలోనూ అతీగతీ లేదు.

జాతీయ రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయ కూటమి అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. అత్యంత కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల సమయంలో సైలెంట్ అయ్యారు. దీంతో కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారు.. ఏం చేయబోతున్నారు అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై పెద్దగా మాట్లాడటం లేదు. రాష్ట్ర పాలనపైనే ఫోకస్ చేశారు. జిల్లాలు చుట్టేస్తున్నారు. కేసీఆర్ తీరు మారడంతో ఆయన నేషనల్ పాలిటిక్స్ కంటే తెలంగాణలో మళ్లీ అధికారంలోకి ఎలా రావాలన్న దానిపైనే ఫోకస్ చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత భారీగా ఉందన్న సర్వే సంస్థల నివేదికలతో కేసీఆర్ అప్రమత్తమయ్యారని.. ప్రతికూలతలను అధిగమించేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే చర్చలు సాగుతున్నాయి. అయితే సడెన్ గా మళ్లీ రూట్ మార్చారు కేసీఆర్. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జాతీయ రైతు సంఘాల నేతలు శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.  ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, జార్ఖండ్‌, ఒడిశా సహా 25 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు ఇందులో ఉన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. జాతీయ రైతు సంఘాల నేతలు, రాష్ట్రాల  రైతు సంఘాల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. ప్రగతి భవన్ లోనే రైతు సంఘాల ప్రతినిధులు కేసీఆర్ తో కలిసి లంచ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్ వివరించారు. నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలను రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు కొనియాడారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే రైతు సంఘాల నేతలతో కేసీఆర్ జరుపుతున్న చర్చలపై కొత్త వాదనలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో రైతు ఎజెండాగానే ముందు సాగే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

మొత్తంగా కొన్ని రోజులుగా కేసీఆర్ తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం జాతీయ రాజకీయాల విషయంలో ఆయన కన్ఫ్యూజనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో స్పష్టమైన నిర్ణయం తీసుకులేకపోతున్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో తనకు ఎవరి కలిసి వస్తారన్న క్లారిటీ లేకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు. గతంలో కేసీఆర్ తో చర్చలు జరిపిన ఉద్దవ్ థాకరే పదవి కోల్పోయారు. జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా పదవి గండంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొన్ని రోజులుగా కేంద్రంపై వ్యాఖ్యలు చేయడం లేదు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉండటంతో జేడీఎస్ నేతలు బిజీగా ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సైలెంట్ గానే ఉన్నారని తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి కూడా కేసీఆర్ కు స్పష్టమైన హామీ రాలేదంటున్నారు. అందువల్లే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారని అంటున్నారు. అందుకే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ, కొత్త రాజకీయ కూటమి అనకుండా... రైతు సమస్యల పేరుతో ఉద్యమించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. రైతు సమస్యలపై పోరాటంలో తనకు వచ్చి స్పందనను బట్టి జాతీయ రాజకీయాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Read also: హిందీ పాటకు ఆఫ్రికా పిల్లల డాన్స్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!

Read also: Pitru Paksha 2022: పితృ పక్షంలో వచ్చే ఆ కలలు దేనికి సంకేతం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More