Home> తెలంగాణ
Advertisement

CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్

CM KCR at Palamuru project: పాలమూరు ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్విఛాన్ చేసి వెట్ రన్ ప్రారంభించారు. పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ స్విఛాన్ చేయడంతో మహా బాహుబలి మోటార్లు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించాయి. 

CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్

CM KCR at Palamuru project: పాలమూరు ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్విఛాన్ చేసి వెట్ రన్ ప్రారంభించారు. పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ స్విఛాన్ చేయడంతో మహా బాహుబలి మోటార్లు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించాయి. దీంతో కృష్ణమ్మ తల్లి పరవళ్లు తొక్కుతూ, నురగలు కక్కుతూ పంప్ హౌజ్ వద్ద పైకి తన్నుకొచ్చిన దృశ్యాలు వీక్షకులకు కనువిందు చేశాయి. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పండితుల వేద మంత్రాల సాక్షిగా కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 

పాలమూరును సస్యశ్యామలం చేస్తూ ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ శుభ సందర్భాన పాలమూరు ప్రాజెక్ట్ తొలి పంప్ హౌజ్ వద్ద సీఎం కేసీఆర్ ఆ గంగమ్మ తల్లిని కొలిచి మనసారా వేడుకున్నారు.

 

అంతకంటే ముందుగా రోడ్డు మార్గాన నాగర్ కర్నూల్ జిల్లా నార్లపూర్ పంప్ హౌజ్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజని కుమార్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా సీఎం కేసీఆర్‌తో పాటే అదే బస్సులో అక్కడికి చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో నార్లాపూర్ బయల్దేరిన సీఎం కేసీఆర్‌కి దారి పొడవునా ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. 

ఇది కూడా చదవండి : Palamuru Project: ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పాలమూరు ప్రాజెక్ట్

పాలమూరు గడ్డ కృష్ణమ్మ చెంతనే ఉన్నప్పటికీ ఆయ కట్టుకు నీరు లేక బీటలు వారిన పాలమూరు నేలను సస్య శ్యామలం చేసే పాలమూరు ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద వెట్ రన్ ప్రారంభోత్సవం సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. కరువు కాటకాలతో వ్యవసాయ భూములు వదులుకుని మరీ వలస వెళ్లిన రైతులు ఉన్న నేలకు ఇక ఆ గోస మాసిపోనుందని.. ఇక పాలమూరు పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంటుంది అని తెలంగాణ సర్కారు ఆశాభావం వ్యక్తంచేసింది. మొత్తానికి సీఎం కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లా పర్యటన పండగ వాతావరణంలో జరుగుతోంది.

ఇది కూడా చదవండి : CM Breakfast Scheme: సీఎం కేసీఆర్ మరో సూపర్ స్కీమ్.. రాష్ట్రంలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More