Home> తెలంగాణ
Advertisement

CM KCR: తెలంగాణలో మత విద్వేశాలకు కుట్ర: సీఎం కేసీఆర్

తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో (Telangana) మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు (CM KCR) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

CM KCR: తెలంగాణలో మత విద్వేశాలకు కుట్ర: సీఎం కేసీఆర్

CM KCR has instructed the police officials: హైదరాబాద్: తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో (Telangana) మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు (CM KCR) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం కేసీఆర్‌ పోలీసు అధికారులను (police officials) ఆదేశించారు. అరాచకశక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని.. వారిని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. Also read: Swamy Goud: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన స్వామిగౌడ్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల (GHMC Election 2020) సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వారు మొదట సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారని, మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రజలను ప్రభావితం చేసేందుకు పూనుకున్నారన్నారు. ఆ తర్వాత మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని కేసీఆర్ తెలిపారు. అయినప్పటికీ శాంతి కాముకులైన హైదరాబాద్‌ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్థపు ప్రచారాన్ని పట్టించుకోలేదన్నారు. తీరా డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్‌లో విఫలమయ్యాని ఆయన తెలిపారు. దీంతో వారు మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

కరీంనగర్, వరంగల్‌, ఖమ్మం ఇలా ఎక్కడో ఒకచోట గొడవలు సృష్టించి.. దాని గురించి హైదరాబాద్‌లో మరింత విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇలా హైదరాబాద్‌లో కూడా ఎక్కడో ఒకచోట ఘర్షణలు సృష్టించి.. దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఒక వికృత చేష్ట చేయాలని కుట్ర పన్నుతున్నారన్నారు. ఇలా చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారని.. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని సీఎం కేసీఆర్ వివరించారు. మత విద్వేశ శక్తుల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సీఎం కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోరాడాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. Also read: EPFO Life Certificate: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More