Home> తెలంగాణ
Advertisement

Tummala Nageshwar Rao: తుమ్మలతో మల్లు భట్టి విక్రమార్క భేటీ..

Tummala Nageshwar Rao To Join Congress Party ?: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.

Tummala Nageshwar Rao: తుమ్మలతో మల్లు భట్టి విక్రమార్క భేటీ..

Tummala Nageshwar Rao To Join Congress Party ?: ఖమ్మం : జిల్లా రాజకీయాల్లో రోజు రోజుకి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో భేటీ అయ్యారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని తుమ్మల నాగేశ్వర్ రావు నివాసానికి చేరుకున్న మల్లు భట్టి విక్రమార్క.. తుమ్మల నాగేశ్వర రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టికి తుమ్మల శాలువా కప్పి ఆహ్వానించారు. వారిద్దరూ కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. 

ఈ భేటీ అనంతరం అనంతరం తుమ్మల నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడాతూ, " భట్టి విక్రమార్క కిందస్థాయి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి నేడు సీఎల్పీ నేత స్థాయికి ఎదిగారు " అని కొనియాడారు. ఒక సీఎల్పీ నేత మన జిల్లా నుండి ఉండటం గర్వకారణం అని అన్నారు. బట్టి విక్రమార్క నాకు ఎంతో ఆప్తుడని ఈరోజు పార్టీలోకి రావాలని ఆహ్వానించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో తుమ్మల నాగేశ్వర రావుతోపాటు నడిచిన అభిమానుల నిర్ణయం తీసుకోని తన అభిప్రాయం చెబుతానని అన్నారు.

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.

తుమ్మల నాగేశ్వర రావుతో భేటీ అనంతరం మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, " రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకులుగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావుని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం కోసమే తుమ్మల నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది " అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నిజాయితీగా రాజకీయాలు విలువలతో కూడిన నాయకులు కరువయ్యారని విలువలతో కూడిన నాయుకులు తుమ్మల నాగేశ్వరరావు అని అయన కొనియాడారు. అటువంటి తుమ్మలను కాంగ్రేస్ పార్టీలోకి  రావాలని కోరుతున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. బట్టి రాకతో తుమ్మల ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, తుమ్మల అభిమానులు భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇది కూడా చదవండి : Yennam Srinivas Reddy Suspended: యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపి.. ఎందుకంటే..

ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తుమ్మల నాగేశ్వర్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషం తెలిసిందే. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సూచనల మేరకే మల్లు భట్టి విక్రమార్క వెళ్లి తుమ్మలతో భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుండి ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనివ్వను అని ఛాలెంజ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తన పని కొంత ఈజీ అవుతుంది అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : MLA Etela Rajender: తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన ఎమ్మెల్యే ఈటల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More