Home> తెలంగాణ
Advertisement

CDFD Jobs 2020: హైదరాబాద్‌లో సైంటిస్ట్‌, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

CDFD Recruitment 2020 | హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD Jobs 2020) పలు సైంటిస్ట్, అడ్మిడిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేస్తోంది.

CDFD Jobs 2020: హైదరాబాద్‌లో సైంటిస్ట్‌, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

హైదరాబాద్‌ (Hyderabad)లోని ఓ ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD Jobs 2020) పలు సైంటిస్ట్, అడ్మిడిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 9 పోస్టులు ఖాళీ ఉండగా, జీతాలు మాత్రం భారీగా అందనున్నాయని నోటిపికేషన్ చూస్తే తెలుస్తోంది.

సైంటిస్ట్ పోస్టులు 5 ఉండగా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 4 ఖాళీలున్నాయి. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ, ఎంటెక్, ఎండీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఎంబయోటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలని సూచించారు. 

 

ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష నిర్వహించి, ఆపై స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్టులు నిర్వహించి పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 30

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More