Home> తెలంగాణ
Advertisement

Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం

BRSV Leaders Pouring Phenyl On Revanth Reddy Photo: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర వివాదం రాజుకోగా.. అనూహ్యంగా ఓ విచిత్ర సంఘటన చేసుకుంది.

Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం

Pouring Phenyl: ఇన్నాళ్లు పాలాభిషేకం.. పుష్పాభిషేకం.. పంచామృత అభిషేకం విన్నారు. చివరకు రక్తాభిషేకం కూడా విని ఉంటారు. కానీ తొలిసారిగా ఫినాయిల్‌ అభిషేకం విన్నారా? రుణమాఫీలో మాట తప్పారని.. బూతులతో విరుచుకుపడుతున్నారనే ఆగ్రహంతో రేవంత్‌ రెడ్డిపై ఫినాయిల్‌ అభిషేకం చేశారు. ఈ వింత సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?

 

ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పుకుంటోంది. దేశ చరిత్రలోనే ఎక్కడా సాధ్యం కానట్టు రైతులందరికీ రుణమాఫీ చేసినట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఈ ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ దీటుగా తిప్పుకుంటోంది. రుణమాఫీ లొసుగులు చెబుతూ.. రైతులకు రుణమాఫీ కాలేదని ఆధారాలతో సహా నిరూపిస్తోంది. ఈక్రమంలోనే స్వాతంత్ర దినోత్సవం రోజు వైరాలో జరిగిన బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని బూతులతో దాడికి పాల్పడ్డారు.

Also Read: K Keshava Rao: కేకే, రేవంత్‌కు భారీ షాక్‌.. రాజ్యసభకు అభిషేక్‌ సింఘ్వీకి ఛాన్స్‌!

 

రాయలేని భాషలో హరీశ్‌ రావుపై ముఖ్యమంత్రి విరుచుకుపడడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం రేవంత్‌పై ప్రతి విమర్శలు చేసింది. అయితే కొందరు హరీశ్‌ రావు అభిమానులు, బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు మరింత ముందుకు వచ్చి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి ఎవరూ ఊహించని రీతిలో ఫినాయిల్‌తో అభిషేకం చేశారు. అంతేకాకుండా బాత్రూమ్‌ బ్రష్‌ తీసుకుని ఫినాయిల్‌తో రేవంత్‌ రెడ్డి నోటిని కడిగినట్లు చేశారు. రాజకీయాల్లో ఏ నాయకుడికి ఇలాంటి విచిత్ర సంఘటన జరగలేదు. విచిత్రంగా ఫినాయిల్‌తో అభిషేకం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ సంఘటన సిద్దిపేటలో జరిగినట్లు సమాచారం.

lనోరు ప్రక్షాళన
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మహిళా నాయకులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులపై అసభ్యంగా దూషిస్తున్న రేవంత్‌ రెడ్డి నోటిని ఫినాయిల్‌తో కడిగినట్లు బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు చెప్పారు. బూతులతో విరుచుకుపడుతున్న ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్‌తో కడుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా రేవంత్‌ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కాదని.. తన నోటిని రేవంత్‌ ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమ నాయకుడు హరీశ్‌ రావుపై విమర్శలు చేయడాన్ని ఖండించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More