Home> తెలంగాణ
Advertisement

KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు

BRS Party: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్‌ ఖండించారు. ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నియామకం చూస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ అనుబంధం తెలిసివస్తోందని, వారిద్దరిదీ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యానించారు.

KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు

Telangana Bhavan: గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉండీ రాజకీయ ప్రసంగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం కేటీఆర్‌ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు.'గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం నామినేట్ చేస్తే.. రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి గవర్నర్‌ వారి అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించారు. కానీ ఈరోజు వస్తున్న వార్తలు ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరామ్‌ ఎలా ఆమోదిస్తున్నారు' అని ప్రశ్నించారు. 

'తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్‌ను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలి. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్‌, రాజ్‌ భవన్ పని చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని కేటీఆర్‌ హితవు పలికారు. మీరు రేవంత్ రెడ్డికి కాదు రాష్ట్ర ప్రజలకు బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలని గవర్నర్‌కు సూచించారు. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యంపై ఉన్న అభ్యంతరాలు నేడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్‌ విమర్శలు చేస్తూ.. 'వారిద్దరిదీ ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలి' అని సవాల్‌ విసిరారు. నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తోందని తెలిపారు. సర్పంచ్‌ పదవీకాలంపై స్పందిస్తూ.. 'సర్పంచ్‌ల పదవీకాలం పొడిగించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచ్‌ల పదవీకాలం పొడిగించాలి. కానీ ప్రత్యేక ఇంచార్జీలను పెట్టవద్దు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంచార్జీలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి' అని తెలిపారు.

రేవంత్‌రెడ్డిని శునకంతో పోలిక
రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'పెద్దలు ఎప్పుడో చెప్పినారు సుమతీ శతకం మాట' అంటూ వేమన రాసిన పద్యం 'కనకపు సింహాసనమున శునకమును కూర్చుని పెట్టిన' వినిపించారు. మంచి ఘడియ పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు తమ బుద్ధి మారరని అప్పుడే వేమన చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మేము ఇంకా అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారని చెప్పారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుచేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవని వివరించారు. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసిన ఇంచిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతాని స్పష్టం చేశారు. బీజేపీ కాంగ్రెస్‌కు జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారని గుర్తుచేశారు.

'రెండు సంవత్సరాల పాటు కరోనా సమయంలో వారి పరిపాలన సమయం పోయిందని.. పదవీ కాలాన్ని ఆరు నెలలు లేదా ఏడాది పొడిగించాలి' అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మంత్రులు అందుబాటులో లేరు, కొత్తగా ఎన్నికైన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటూ సర్పంచ్‌లు పూర్తిచేసిన కార్యక్రమాల ప్రారంభాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. 

Also Read: Karimnagar: బండి సంజయ్‌ భారీ వ్యూహం.. కరీంనగర్‌లో 28న అమిత్‌ షా సమావేశం

Also Read: Shameful Incident: విద్యార్థి జుట్టు పట్టి లాగిన పోలీస్‌.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More