Home> తెలంగాణ
Advertisement

Cantonment By Poll: కంటోన్మెంట్‌పై కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఆమెకే టికెట్‌.. అతడికి భారీ షాక్‌

BRS Candidate Niveditha For Cantonment By Poll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మృతి చెందిన లాస్య నందిత కుటుంబానికే టికెట్‌ కేటాయించగా.. టికెట్‌ ఆశించిన సీనియర్‌ నాయకుడికి భారీ షాక్‌ ఇచ్చారు.

Cantonment By Poll: కంటోన్మెంట్‌పై కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఆమెకే టికెట్‌.. అతడికి భారీ షాక్‌

Niveditha: సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతితో అనివార్యమైన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అభ్యర్థి మరణిస్తే ఆ స్థానం ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉండగా అధికార కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అలాంటి ఆనవాయితీ కొనసాగించడం లేదు. అభ్యర్థి మరణించిన చోట పోటీకి దిగుతోంది. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ సిట్టింగ్‌ స్థానం తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. మరణించిన లాస్య నందిత కుటుంబానికే గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించారు. అయితే కేసీఆర్‌ నిర్ణయంతో ఆ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఓ నాయకుడికి భారీ షాక్‌ తగిలింది.

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

 

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున లాస్య నందిత గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు నందిత మృతిపై ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు రావడంతో వాటితోపాటు కలిపి కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది.

Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం

 

ఎన్నికలకు సమయం రావడంతో కేసీఆర్‌ పార్టీ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితకు అవకాశం కల్పించారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానంలో ఆ కుటుంబానికి చెందిన వారికే అవకాశం ఇస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. నివేదితను కంటోన్మెంట్‌ అసెంబ్లీ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ నివేదిత అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

క్రిశాంక్ నిరాశ
అయితే ఈ స్థానంలో పోటీ చేయాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, యువకుడు మన్నె క్రిశాంక్‌కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ టికెట్‌ ఆశించారు. అయితే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న మృతిచెందడంతో ఆయన కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని భావించి లాస్య నందితకు అవకాశం కల్పించారు. ఆమె అక్కడి నుంచి గెలిచి హఠాన్మరణం చెందారు. ఉప ఎన్నికలోనైనా తనకు అవకాశం దక్కుతుందని భావించిన క్రిశాంక్‌కు ఈసారి కూడా అవకాశం లభించలేదు. మృతుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలనే సంప్రదాయం ప్రకారం నివేదితకు అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని క్రిశాంక్‌కు పార్టీ పెద్దలు వివరించి బుజ్జగించారు.

తూట్లు పొడిచిన కాంగ్రెస్
కాగా ఈ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక సభ్యుడు మృతి చెందిన స్థానంలో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సి ఉంది. ఇలాంటి సంప్రదాయం కొనసాగుతోంది. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచింది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిని ప్రకటించి పోటీలో నిలిచింది. కాంగ్రెస్‌ తీరుపై కంటోన్మెంట్‌ ప్రజలు తప్పుబడుతున్నారు. పోటీ చేసినా కూడా కంటోన్మెంట్‌ సీటులో గెలిచేది సాయన్న కుటుంబమేనని అక్కడి ప్రజలు చెబుతారు. సాయన్న, లాస్య నందితను గెలిపించినట్టే నివేదితను కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని కంటోన్మెంట్‌ ప్రజలు చెబుతున్నారు. సాంప్రదాయానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More