Home> తెలంగాణ
Advertisement

Brs Harish Rao: బిడ్డా లిల్లిపుట్.. సీఎం రేవంత్ పై మరోసారి పంచులు కురిపించిన హరీష్ రావు..

Brs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు  మండిపడ్డారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆరు గ్యారంటీల పథకంపై నా ఛాలెంజ్ కు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. రేపు ఉదయం అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు. 

Brs Harish Rao: బిడ్డా లిల్లిపుట్.. సీఎం రేవంత్ పై మరోసారి పంచులు కురిపించిన హరీష్ రావు..

BRS Harish Rao Fires On CM Revanth Reddy In Medak: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొలది తెలంగాణ రాజకీయాలు మరింత హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ఎవరు కూడా తగ్గట్లేదు. నువ్వేంత అంటే నువ్వేంత అంటూ పదునైన ఆరోపణలతో ఒకరిపై మరోకరు పంచ్ లు కురిపించుకుంటున్నారు. అంతే కాకుండా.. ఎన్నికల బరిలో నాయకులు సవాళ్లు ,ప్రతిసవాళ్లలతో తెలంగాణ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి మరిన్నిసీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ప్రజల్లో తమకు ఇంకా ఆదరణ ఉందని, ఉద్యమ జ్వాలను రగిల్చే ప్రయత్నంచేస్తున్నారు.

Read More: Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ హరీష్ రావు లోక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని మెదక్ కు రప్పించిన ఘటన మాజీ సీఎం కేసీఆర్ దని తెలిపారు. అంతేకాకుండా.. మెదక్ ను జిల్లాగా ప్రకటించి, కలెక్టర్ ఆఫీసును కట్టించామని తెలిపారు.ఆనాడు కేసీఆర్ కట్టిన కలెక్టర్ ఆఫీసులో ఈనాడు నేతలు నామినేషన్ వేసేలా చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంగారెడ్డికి వెళ్లి నామినేషన్ లు వేసేవాళ్లమని గుర్తు చేశారు.

అదే విధంగా.. సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో అనేక సందర్భాలలో రుణమాఫీని ఆగస్టు 15 వరకు మాఫీ చేస్తామంటూ అనేక దేవుళ్ల మీద ఓట్టులు వేస్తున్నాడు. ఇది నిజమైతే.. రేపు ఉదయం అమర వీరుల స్థూపం దగ్గరకు రాజీనామా పత్రంను తీసుకురావాలని, తానుకూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పత్రం తీసుకొస్తానని, ఇద్దరు కలిసి మేధావుల చేతికి ఆ రాజీనామాలు ఇద్దామన్నారు. ఒకవేళ ఆగస్టు 15లోపు , రుణమాఫీ చేయకుండా సీఎం రాజనామాను మేధావులు గవర్నర్ కు అప్పగిస్తారని, అదేవిధంగా ఒక వేళ సీఎం రేవంత్ ఆరుగ్యారంటీలు, రుణమాఫీలను అమలు చేస్తే, తన రాజీనామా పత్రంను అసెంబ్లీ స్పీకర్ కు అందజేయవచ్చని హరీష్ రావు సవాల్ విసిరారు.

Read More: Viral Video: నా భార్య సీట్లోనే కూర్చుంటావా..?.. బస్సులో కోట్లాటకు దిగిన భర్తలు.. వైరల్ వీడియో..

సీఎం రేవంత్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. కేసీఆర్ ను చూసి ఓర్వలేక ఇలాంటి చిల్లర మాటలు రేవంత్ మాట్లాడుతున్నారు. బస్సుయాత్రలో గులాబీబాస్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని, వచ్చే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు లోకసభ స్థానాలు కాంగ్రెస్ కన్నా ఎక్కువగా వస్తాయన్నారు. సీఎం రేవంత్ ఎల్లప్పుడు కూడా, కేసీఆర్ ను తిట్టడం కోసమే పదవిలో వచ్చినట్లుందని అన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More