Home> తెలంగాణ
Advertisement

Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్కొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్కొండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.

Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్కొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Bonalu 2024 Telangana state festival in Hyderabad: తెలంగాణలో బోనాల పండుగను  ఎంతో భక్తితో చేసుకుంటారు. ఆషాడ మాసంలో బోనాల శోభతో రాష్ట్రమంతాట కూడా అమ్మవారి ఆలయాల్లో ఆదివారం, గురువారం బోనాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా బోనాల పండుగ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. మొదటగా..గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజ, బల్కంపేట అమ్మవార్ల దేవాలయాలలో వరుసగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో గల్లీ గల్లీలోని ఆలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

పెయింటింగ్ లు  పెట్టి, వేప ఆకులతో ప్రత్యేకమైన తోరణాలను కూడా కట్టారు. అమ్మవారికి బోనం సమర్పించి, తొట్లెలను కూడా సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాకుండా.. ఫలాహరం బండ్లను ఊరేగింపులు చేసి, శివసత్తులు, పొతరాజుల విన్యాసాలతో ఎంతో భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనం అంటే భోజనం. అమ్మవారు వర్షాకాలంలో కలిగే  వ్యాధులు వ్యాప్తి చెందకుండా, కుటుంబాలను చల్లగా చూడాలని బోనం సమర్పిస్తారు.. అందుకే కుండులో పెరుగన్నం, దానిపైన చల్లని వేప నీరు, దానిపైన దీపంలు పెట్టి బోనంలు సమర్పిస్తారు. ఆ తల్లి ఈ బోనం స్వీకరించి మనల్ని చల్లగా చూస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

గోల్గొండలోనే తొలిబొనం ఎందుకు..

గోల్కొండ కోటకు జగదంబిక అమ్మవార్లకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్కడ వెలసిన అమ్మవారు భక్తులకు కొంగు బంగారమని భావిస్తారు. కాకతీయులు, తానీషా కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా.. ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుంచి పటేల్ వంశం బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ సమర్పించే బోనంను నజర్ బోనం అనికూడా అంటారు. ఇప్పటికి కూడా ఆయా వంశాల వారు వందల ఏళ్లుగా తమ కుటుంబంవారు బోనం సమర్పిస్తున్నారు.

అంతేకాకుండా.. హైదరబాద్ కు గోల్కొండ కోట అనేది ఒక మణిహరం. అందుకే ఇక్కడ తొలిబొనం సమర్పించడం ఆనావాయితీగా వస్తుంది. జులై 7 ప్రారంభమైన లంగర్ హౌజ్ నుంచి బోనం ప్రారంభమై, గొల్గొండకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రతి ఆదివారం, గురువారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గోల్గొండ బోనాల తర్వాత బల్కంపేట ఎల్లమ్మ కు బోనాలు సమర్పిస్తారు. జులై 8న ఎదుర్కొలు ఉత్సవం, 9 కళ్యాణ, 10 వ తేదీన రథోత్సవంలు నిర్వహిస్తారు.ప్రభుత్వం తరపున అమ్మవారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలు కూడా సమర్పిస్తారు.

జులై 7 న ఆదివారం గోల్కొండ జగదాంబిక బోనాలు ప్రారంభం
జులై 9 మంగళవారం బల్కంపేట అమ్మవారి కళ్యాణం
జులై 7 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఎదుర్కొలు ఉత్సవం,
జులై 21 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు
జులై 28 ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు
జులై 29, సోమవారం సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం,భవిష్య వాణి ఉత్సవం జరుగుతంది.

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

ఇప్పటికే బోనాల పండుగకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఏర్పాట్లలో లోపాలు ఉండకుండా చూసుకొవాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత తొలిబొనాల పండుగ కావడంతో సీఎం సర్కారు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీసులు కూడా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా బందో బస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కల్గకుండా చర్యలు చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More