Home> తెలంగాణ
Advertisement

Mla Raja Singh Comments: గ్యాంగ్‌ రేప్‌ కేసులో సీఎంవో నుంచే తప్పించే కుట్రలు..రాజాసింగ్ హాట్ కామెంట్స్..!

Mla Raja Singh Comments: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిందితులను ప్రభుత్వ పెద్దలు తప్పిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Mla Raja Singh Comments: గ్యాంగ్‌ రేప్‌ కేసులో సీఎంవో నుంచే తప్పించే కుట్రలు..రాజాసింగ్ హాట్ కామెంట్స్..!

Mla Raja Singh Comments: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిందితులను ప్రభుత్వ పెద్దలు తప్పిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు నిందితులంతా సైడ్‌ అయ్యిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ప్రభుత్వం తీరుపై బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అధికారికంగా వినియోగించే ప్రభుత్వ వాహనంలో ఘటన జరగడం సిగ్గు చేటు అని అన్నారు.

అధికారంలో ఉంటే ఏదైనా చెల్లుతుందన్న భావనలో టీఆర్ఎస్, మజ్లిస్ నాయకులు ఉన్నారని విమర్శించారు. వారి బరితెగింపునకు అడ్డు అదుపులేకుండా పోతోందని మండిపడ్డారు. అధికారిక వాహనాలను సొంత అవసరాలను వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు. సామూహిక అత్యాచారం కేసులో టీఆర్ఎస్‌, మజ్లిస్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నట్లు సీసీపుటేజీలు, వీడియోల్లో స్పష్టంగా ఉన్నా..ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

ఇదంతా చూస్తుంటే తమకు అనుమానాలు కల్గుతున్నాయని రాజాసింగ్ చెప్పారు.  ఈకేసులో నిందితుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేయకుండా విదేశాలకు పారిపోయేదాకా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల ప్రమేయం ఉందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పబ్‌లో హోంమంత్రి మనవడు పార్టీ ఇచ్చినట్లు అందరికీ తెలుసున్నారు.

సీఎం కార్యాలయం నుంచే నిందితులను తప్పించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్. ఇలాంటి తరుణంలో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని తెలిపారు. బీజేపీ నేతలు పోరాడిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే..దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని డిమాండ్ రాజాసింగ్ చేశారు.

Also read: Devineni Uma Comments: పోలవరం ప్రాజెక్ట్‌లో స్కాం..సీఎం జైలుకు వెళ్లడం ఖాయమన్న దేవినేని..!

Also read:Shah Rukh-Katrina: బాలీవుడ్​లో మరోసారి కరోనా కలకలం..షారుక్​, కత్రినాలకు పాజిటివ్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

 

Read More