Home> తెలంగాణ
Advertisement

Telangana: ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలోని వైరాలో శనివారం బీజేపీ నేత నెలవెళ్లి రామారావు (BJP Leader Nelavelli Ramarao ) పై కత్తితో దాడి జరిగింది.

Telangana: ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య

BJP leader murdered in Khammam district Telangana హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలోని వైరాలో శనివారం బీజేపీ నేత నెలవెళ్లి రామారావు (BJP Leader Nelavelli Ramarao )పై కత్తితో దాడి జరిగింది. ఈ క్రమంలో ఆయన్ను హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వైరాకు చెందిన బీజేపీ నాయకుడు రామారావుపై అదే పట్టణానికి చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. 

వైరా (Wyra) పాత బస్టాండ్ ప్రాంతంలోని బీజేపీ (BJP) నాయకుడు నెలవెళ్లి రామారావు ఇంటికి వెళ్లిన నిందితుడు కత్తితో నాలుగు సార్లు పొడిచినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో రామారావు అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడిపోయాడు. వెంటనే ఆయన్ను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని వైరా పోలీసులు పరిశీలించి దాడికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..
దారుణ హత్యకు పాల్పడిన నిందితుడు ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆర్థిక పరమైన కారణాలతోనే నేలవెళ్లి రామారావును చంపినట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు అంతకుమందు రామారావు అనుచరుడిగా ఉన్నాడని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన (Telangana) రాష్ట్రంలో సంచలనంగా మారింది. 
Also Read: Chittoor: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More