Home> తెలంగాణ
Advertisement

Balanagar Fly Over: రన్ వే కాదిది..ఫ్లై ఓవరే, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Balanagar Fly Over: తెలంగాణ రాజధాని నగరం మరో కొత్త శోభ సంతరించుకుంది. ప్రతిష్ఠాత్మక బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ ఫ్లై ఓవర్ సిక్స్‌లైన్ కావడం విశేషం.
 

Balanagar Fly Over: రన్ వే కాదిది..ఫ్లై ఓవరే, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Balanagar Fly Over: తెలంగాణ రాజధాని నగరం మరో కొత్త శోభ సంతరించుకుంది. ప్రతిష్ఠాత్మక బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ ఫ్లై ఓవర్ సిక్స్‌లైన్ కావడం విశేషం.

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ అభివృద్ధి పథాన దూసుకుపోతోంది.రోజురోజుకూ కొత్త శోభ సంతరించుకుంటోంది. ముఖ్యంగా జంట నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను దూరం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కొత్తగా ఫ్లై ఓవర్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్(Balanagar Fly over) నిర్మాణం పూర్తి చేసింది. 2017 ఆగస్టు 21న ప్రారంభమైన ఫ్లై ఓవర్‌ను 387 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు.హైదరాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం కావడంతో ట్రాఫిక్ సమస్య చాలా వరకూ తీరనుంది. 1.13 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లై ఓవర్..మొట్ట మొదటి సారిగా ఆరు లైన్లతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా బాలానగర్, ఫతేనగర్ డివిజన్లున్నాయి. వందలాది పరిశ్రమలున్నాయి. ఆరు లైన్లతో 24 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ రాత్రి వెలుగుల్లో విమానాశ్రయపు రన్ వే(Run Way)ను తలపిస్తోంది.మంత్రి కేటీఆర్ ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కూకట్ పల్లి-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని మంత్రి కేటీఆర్ ( Minister KTR) తెలిపారు. 

Also read: Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More