Home> తెలంగాణ
Advertisement

GHMC Elections 2020: పోలింగ్‌కు సర్వం సిద్ధం..ఓటర్లు, అభ్యర్ధులు, పోలింగ్ స్టేషన్ల వివరాలివే

GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నిలకు ఎన్నికల కమీషన్ సర్వం సిద్ధం చేసింది. పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మిగిలింది. ఉదయం 7 గంటల్నించి..సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, అభ్యర్ధుల వివరాలివే..

GHMC Elections 2020: పోలింగ్‌కు సర్వం సిద్ధం..ఓటర్లు, అభ్యర్ధులు, పోలింగ్ స్టేషన్ల వివరాలివే

GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నిలకు ఎన్నికల కమీషన్ సర్వం సిద్ధం చేసింది. పోలింగ్‌కు మరి కొద్ది గంటల సమయం మిగిలింది. ఉదయం 7 గంటల్నించి..సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, అభ్యర్ధుల వివరాలివే..

ప్రచారం పర్వం ( Election campaign ) ముగిసింది. ఇక మరి కొద్ది గంటల్లో గ్రేటర్ ఓటర్ తీర్పు ఇవ్వనున్నాడు. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుందని..ఎన్నికల కమీషనర్ పార్ధసారధి వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 150 డివిజన్లకు జరగనున్న ఎన్నికల్లో 1122 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి అంటే నవంబర్ 29 సాయంత్రం 6 గంటల్నించి..ఎన్నికలు ముగిసేవరకూ గ్రేటర్ హైదరాబాద్ ( Greater Hyderabad ) పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

Also read: GHMC Election 2020: జీహెచ్ఎంసి యాప్‌లో పోలింగ్ కేంద్ర వివరాలు, మరెన్నో సదుపాయాలు..

ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ( Ghmc Elections ) ఈవీఎం పద్దతిలో కాకుండా..బ్యాలెట్ పేపర్ ( Ballot paper ) ద్వారా జరగనుండటం విశేషం. ఎన్నికల సిబ్బంది డిసెంబర్ 1వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని..6 గంటల వరకూ పోలింగ్ ఏజెంట్లు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమీషన్ సూచించింది.

డిసెంబర్ 1వ తేదీ ఉదయం 6 గంటల్నించి పదిహేను నిమిషాల వరకూ మాక్ పోలింగ్ ఉంటుంది. 6 గంటల 55 నిమిషాలకు బ్యాలెట్ బాక్సుల్ని సీల్ చేస్తారు. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. కోవిడ్ పాజిటివ్ సోకి..బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటు వేసే అవకాశముంటుంది. కోవిడ్ రోగుల కోసం సాయంత్రం 5 గంటల్నించి 6 గంటల వరకూ సమయం కేటాయించారు.

మొత్తం 9 వేల 101 పోలింగ్ స్టేషన్లు ( Polling stations ) ఏర్పాటు చేశామని..ఇందులో 1752 అతి సమస్యాత్మకంగా,  2 వేల 934 సమస్యాత్మకంగానూ, 4 వే 415 సాధారణ పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక పోలింగ్ లొకేషన్లు 2 వేల 909 ఉండగా..450 వరకూ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా పరిగణిస్తున్నారు. పోలింగ్ సందర్బంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా..52 వేల పోలిసు సిబ్బందిని మోహరించారు. 

150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ ( Face recognition ) సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగిస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముందు రోజు పూర్తిగా శానిటైజేషన్ చేయనున్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. Also read: GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికలకు భారీగా పోలీసు బలగాలు

Read More