Home> తెలంగాణ
Advertisement

Akbaruddin Owaisi: విద్వేష ప్రసంగాల కేసులో అక్బరుద్దీన్​ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లో కోర్టులో ఊరట లభించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. ఇందులో అక్బరుద్దీన్​ను నిర్దోషిగా తేల్చింది.

Akbaruddin Owaisi: విద్వేష ప్రసంగాల కేసులో అక్బరుద్దీన్​ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

Akbaruddin Owaisi: ఎంఐఎం నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేష పూరిత ప్రసంగం కేసులో తుది తీర్పు వెలువరించింది నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు. ఈ కేసులో అక్బరుద్దీన్​ను నిర్దోషిగా తేల్చింది.

అసలు కేసు ఏమిటి?

తొమ్మిదేళ్ల క్రితం నిర్మల్​, నిజామాబాద్ బహిరంగ సభల్లో ప్రసంగించిన అక్బరుద్దీన్​ ఒవైసీ.. విద్వేశపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణల అనంతరం ఇటీవల.. తుది వాదనలు విన్న న్యాయస్థానం నేడు తుది తీర్పు వెలువరించింది.

ఈ కేసు తీర్పు నేపథ్యంలో హైదారాబాద్​ పాత బస్తీలో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది పోలీస్​ శాఖ. ముఖ్యంగా అల్లర్లు జరిగేందుకు ఆస్కారమున్న ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించింది.

Also read: KA Paul: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చిత్తుచిత్తుగా ఓడడం ఖాయం.. కేసీఆర్‌కి ప్రత్యామ్యాయం నేనే: కేఏ పాల్

Also read: Akbaruddin case: నేడే అక్బరుద్దీన్ కేసు తుది తీర్పు.. పాత బస్తీలో భద్రత కట్టుదిట్టం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More