Home> తెలంగాణ
Advertisement

Jeevitha Rajashekar Cheating Case: అరెస్ట్‌పై స్పందించిన జీవితా రాజశేఖర్‌..ఏమన్నారంటే..!

Jeevitha Rajashekar Cheating Case: తమపై వచ్చిన ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు. గరుడ వేగ సినిమా లావాదేవీల విషయంలో హీరో రాజశేఖర్, నటి జీవిత తమను మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడెక్షన్స్ కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపణలు చేయడం దుమారం రేపింది. 

Jeevitha Rajashekar Cheating Case: అరెస్ట్‌పై స్పందించిన జీవితా రాజశేఖర్‌..ఏమన్నారంటే..!

Jeevitha Rajashekar Cheating Case: తమపై వచ్చిన ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు. గరుడ వేగ సినిమా లావాదేవీల విషయంలో హీరో రాజశేఖర్, నటి జీవిత తమను మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడెక్షన్స్ కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపణలు చేయడం దుమారం రేపింది. 26 కోట్ల మేర జీవిత, రాజశేఖర్ తమను మోసం చేశారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. దాంతో ఈ వ్యవహారం దుమారం రేపింది. తాజాగా దీనిపై జీవిత స్పందించారు. శేఖర్ మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న  జీవిత ...తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.

 రెండు నెలలుగా ఈ కేసు కోర్టులో ఉండగా.. ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చారని ప్రశ్నించారు. 2 నెలల క్రితమే వారంట్ వచ్చిందనీ..నాకు ఎలాంటి సమన్లు అందలేదన్నారు. తప్పచేస్తే తానే ఒప్పుకుంటాననీ... లేదంటే దేవుడినైనా ఎదిరించడానికి సిద్ధమన్నారు. ప్రస్తుతం కోర్టు కేసు ఉన్నందున తాను ఎక్కువ మాట్లడబోనన్నారు. దేన్నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 

యూట్యూబ్‌లో కొందరు తమను టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టారు. కొందరు ఏవేవో వీడియోలు క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్లు పెట్టారని మండిపడ్డారు. సెలబ్రిటీలకు వ్యతిరేకంగా యూట్యూబ్‌లో పోస్టులు పెడుతున్నారనీ ఇది మంచి పద్ధతి కాదన్నారు. మొన్న తన కూతుళ్ల గురించి తప్పుగా పోస్టు చేశారనీ.. తాజాగా నటి నిహారికపై ఇలాగే చేశారన్నారు. ఇష్టం వచ్చినట్లు థంబ్‌నేల్స్ పెట్టి ఇబ్బందిపెట్టొదన్నారు. తమపై ఆరోపణలు చేసిన వాళ్లేమీ మహాత్ములు కాదనీ వాళ్ల వల్ల మా మేనేజర్‌తో పాటు చాలా మంది ఇబ్బందిపడ్డారన్నారు.

2017లో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సినిమా పీఎస్‌వీ గరుడవేగ. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వరుస ప్లాపులతో ఉన్న రాజశేఖర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. భారీగా కలెక్షన్లు రాబట్టింది. రాజశేఖర్ కుటుంబం స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమాకు జోస్టర్ ఫిలిం సర్వీసెస్ గ్రూప్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. 

అయితే ఈ సినిమాను తీసేందుకు రాజశేఖర్ దంపతులు ఆస్తులు తాకట్టు పెట్టి తమ వద్ద 26 కోట్లు తీసుకున్నారని  జోస్టర్ ఫిలిం సర్వీసెస్ యజమానులు తెలిపారు. అయితే ఆ ఆస్తులను బినామిల పేరుతో మార్చుకుని తమను మోసం చేసినట్లు వారు ఆరోపించారు. తమిళనాడుతో పాటు ఏపీలోని నగరి కోర్టులో జీవితా రాజశేఖర్‌పై కేసులు నమోదయ్యాయి.

Also read: KTR Comments‌: కేటీఆర్ సంచలన కామెంట్స్‌..ఎంఐఎంతోనే మాకు పోటీ.. బీజేపీకి సింగిల్ డిజిటే.!

Also read: Goa Special Permit: గోవా వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More