Home> తెలంగాణ
Advertisement

Minor Rape Victim: రెచ్చిపోతున్న కామాంధులు..హైదరాబాద్‌లో మరో దారుణం..!

Minor Rape Victim: దేశంలో ఎన్నో కఠిన చట్టాలను తీసుకొచ్చినా మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ మరో ఘటన బయట పడింది.

Minor Rape Victim: రెచ్చిపోతున్న కామాంధులు..హైదరాబాద్‌లో మరో దారుణం..!

Minor Rape Victim: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌ ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో 9 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను బెదిరించి దారుణాన్ని పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక పెరెంట్స్‌ ..ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు ఆటో డ్రైవర్ సలీంను అరెస్ట్ చేశారు. అత్యాచారానికి గురై బాలిక కుటుంబసభ్యులను మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పరామర్శించారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వారితో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. 

హైదరాబాద్‌లో వరుస ఘటనలు వెలుగు చూస్తుడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ చేతగాని తనం వల్లే దారుణాలు వెలుగు చూస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా రాజకీయ నాయకుల కుమారులే కావడం చర్చనీయాంశంగా మారింది.

 

Also read:Bandi Sanjay on CM Kcr: కుట్రలో భాగంగానే ఆర్టీసీ ఛార్జీల మోత..సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్..!

Also read:Supriti Kachhap: ఖేలో ఇండియా పోటీల్లో సుప్రీతి సూపర్ షో..బద్దలైన నేషనల్‌ రికార్డు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More