Home> తెలంగాణ
Advertisement

Minister Harish Rao: కస్టమర్ చిరునామాల అప్‌డేట్‌పై దృష్టి పెట్టండి..జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రి హరీష్‌రావు..!

Minister Harish Rao: చండీగఢ్‌లో రెండురోజులపాటు జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కౌన్సిల్ ముందు మంత్రి హరీష్‌రావు కీలక విషయాలను తీసుకొచ్చారు.

Minister Harish Rao: కస్టమర్ చిరునామాల అప్‌డేట్‌పై దృష్టి పెట్టండి..జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రి హరీష్‌రావు..!

Minister Harish Rao: రాష్ట్ర విభజన వల్ల, నిర్ధిష్ట పన్ను చెల్లింపుదారులు కస్టమర్ చిరునామాలను అప్‌డేట్‌ చేయకపోవడంతో భారీగా ఆదాయం దారి తప్పుతోందన్నారు మంత్రి హరీష్‌రావు. ఇదే విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లో కస్టమర్ చిరునామాలు తెలంగాణ ఉన్నప్పటికీ ఏపీగానే పరిగణలో ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపాదిత కొత్త 3బీ ఫారమ్‌లో జీఎస్టీఆర్ 3బీ(GSTR 3B) ప్రతికూల విలువలను అనుమతించాలన్నారు.

చండీగఢ్‌లో రెండురోజులపాటు జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన భేటీలో మంత్రి హరీష్‌రావుతోపాటు ఆయా రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుత 3బీ రిటర్న్‌లో ఇదే సదుపాయం కల్పించాలని..దీంతో ఈఏడాది నుంచి పన్ను చెల్లింపుదారుల చిరునామాల తప్పులను సరిదిద్దుకోవచ్చని అన్నారు.

పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ జ్యూడిరిక్షన్ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల అధికారుల సహకారం కావాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం దృష్టికి మంత్రి హరీష్‌రావు తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుదారులపై మళ్లీ ఐజీఎస్‌టీ చెల్లింపు భారం పడకుండా..ఇప్పటికే చెల్లించిన పీఓఎస్‌తో ఐజీఎస్‌టీని వాపసు చేయాలన్నారు. స్థానిక సంస్థల విధులకు సంబంధించిన స్వచ్ఛ పరికరాలకు మినహాయింపుల జాబితాను విస్తరించాలని జీఎస్టీ ఛైర్‌పర్సన్‌ను మంత్రి హరీష్‌రావు కోరారు.

జాబితాను విస్తరించకపోతే స్థానిక సంస్థలపై భారం పడుతుందన్నారు. దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించి ప్రతిపాదనలు తీసుకోవాలని చెప్పారు. జీఎస్టీ(GST) అప్పీలేట్ నిబంధనలకు సంబంధించిన విషయాన్ని సమావేశంలో మంత్రి హరీష్‌రావు తీసుకొచ్చారు.  ప్రతిపాదిత నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని..ఆచరణాత్మకంగా లేవన్నారు. ఇందుకు జీఎస్టీ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ అంగీకారం తెలిపారు.

దీనిపై ఆగస్టు 1లోగా ప్రతిపాదనలు సమర్పించాలని జీవోఎం(GOM)ని జీఎస్టీ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ సూచించారు. కాసినో, గుర్రపు పందాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై జీవోఎం ప్రతిపాదనలను ఆమోదించారు. దీనిపై జూలై 15 లోపు నివేదిక ఇవ్వాలని జీఎస్టీ ఛైర్‌పర్సన్ అంగీకరించారు.

Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం..!

Also read: AP High Court: రఘురామ కృష్ణరాజుకు ఎదురుదెబ్బ..విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న హైకోర్టు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More