Home> తెలంగాణ
Advertisement

Telangana: ఒక్క రోజే 206 మందికి కరోనా.. 10 మంది మృతి

Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Telangana: ఒక్క రోజే 206 మందికి కరోనా.. 10 మంది మృతి

Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా  152 ఉండగా మేడ్చల్ జిల్లా పరిధిలో 18 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి జిల్లాలో 10, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, నిర్మల్ జిల్లాలో 5, మహబూబ్ నగర్ జిల్లాలో 4 కేసులను గుర్తించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జగిత్యాలలో 2, నాగర్ కర్నూలులో 2, మహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల్, నల్గొండ, భద్రాద్ది-కొత్తగూడెం, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. (Read also :  Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )

ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 448 మందికి కరోనా సోకింది. వీళ్లు కాకుండా మరో 3,048 మంది తెలంగాణలో ఉంటూనే కరోనా బారినపడ్డారు. అన్నీ కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,496కి చేరుకుంది. 

కరోనా కారణంగా ఇవాళ మరో 10 మంది చనిపోయారు. దీంతో  ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 123 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా మరో 1,663 మంది కరోనావైరస్‌తో చికిత్స పొందుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

( Read also : Health tips: సమ్మర్‌లో ఎండ వేడి నుంచి ఈ పానియాలతో త్వరిత ఉపశమనం )

Read More