Home> తెలంగాణ
Advertisement

10 years Old Boy Drawing Skills: చూసింది చూసినట్టు అచ్చు దించేస్తాడు..

10 years Old Boy Drawing Skills: ఆ బాలుడి వయస్సు పది సంవత్సరాలు, కానీ ఎంతో అనుభవం ఉన్న చిత్రకారుడిలా ప్రముఖుల చిత్రాలను అధ్బుతంగా రూపొందిస్తూ తన చిత్రలేఖనంతో చూపరులను ఆకట్టుకుంటున్నాడు‌. 

10 years Old Boy Drawing Skills: చూసింది చూసినట్టు అచ్చు దించేస్తాడు..

10 years Old Boy Drawing Skills: ఆ బాలుడి వయస్సు పది సంవత్సరాలు, కానీ ఎంతో అనుభవం ఉన్న చిత్రకారుడిలా ప్రముఖుల చిత్రాలను అధ్బుతంగా రూపొందిస్తూ తన చిత్రలేఖనంతో చూపరులను ఆకట్టుకుంటున్నాడు‌. చదువుతుంది 4వ తరగతి.. కానీ చిత్రలేఖనంలో మాత్రం మాస్టర్ డిగ్రీ చేసినంత దిట్టగా కనిపిస్తూ అబ్బురపరుస్తున్నాడు. ఎక్కడ నేర్చుకున్నది లేదు.. ఎవరు నేర్పించింది లేదు కానీ చూసింది అచ్చుగుద్దినట్లు బొమ్మలు వేస్తూ చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన బాలుడు జగన్ సింగ్ పై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కధనం ఇది.

సత్తుపల్లి పట్టణం రాజీవ్ నగర్ లోని కూనా సింగ్, పాపా కౌర్ ల నాలుగవ సంతానమే ఈ బాలుడు. పేరు జగన్ సింగ్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న జగన్ సింగ్ కు చిన్న తనం నుండే చిత్ర లేఖనంపై అమితమైన ఇష్టం ఏర్పడింది. పుస్తకాలలోని బొమ్మలను అచ్చుగుద్దినట్టు కాగితంపై గీస్తున్నాడు.. పంజాబ్ రాష్ట్రం నుండి బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సిక్కుల కుటుంబం వీళ్లది. ఇనుప రేకులతో ఇంట్లో కావాల్సిన సామాన్లు కత్తిపీటలు, బాల్చాలు తయారు చేస్తూ వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సిక్కు కుటుంబంలో ఎవరు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు లేరు. కానీ జగన్ సింగ్ కు మాత్రం సరస్వతి కటాక్షం పుట్టుకతోనే లభించిందని ఆ బాలుడి గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు.

ఒకవైపు చదువుతూనే తండ్రికి సహాయంగా కత్తి పీటల వ్యాపారం చేస్తోన్న జగన్ సింగ్.. ఖాళీ సమయాల్లో ఇలా చిత్రాలు గీస్తూ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అది గమనించిన తల్లిదండ్రులు తమ బిడ్డకు చిత్ర లేఖనంలో మంచి భవిష్యత్ ఉందని గ్రహించి తమకు ఉన్నదాంట్లో డ్రాయింగ్ బుక్ కొనిచ్చి ఆనంద పడుతున్నారు. పెద్దలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డకు చిత్రలేఖనంలో ప్రావీణ్యం కల్పిస్తే తమ బిడ్డ గొప్పవాడు అవుతాడని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : YS Sharmila Slams BJP, BRS: ఈ దెబ్బతో బీజేపి, బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందన్న షర్మిల

తనకి చిన్న తనం నుండే చిత్ర లేఖనంపై చాలా ఇష్టం ఉందని ఏ చిత్రం కనిపిస్తే దాన్ని అలానే గీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానని బాలుడు జగన్ సింగ్ చెబుతున్నాడు. ఒక్కొక్క పెన్సిల్ ఆర్ట్ వేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని తెలిపాడు. జగన్ సింగ్ అద్భుతంగా చిత్రాలు గీస్తున్నాడని.. సరైన ప్రోత్సాహం లభిస్తే దేశం గర్వించదగ్గ చిత్రకారుడు అవుతాడని స్థానికులు అంటున్నారు. జగన్ సింగ్ లోని టాలెంట్ ను గుర్తించి పెద్దలు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే చాలా గొప్పవాడు అవుతాడని జగన్ లోని కళా నైపుణ్యం గురించి తెలిసిన వారు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : Vemula Veeresham Slams Chirumarthi Lingaiah: చిరుమర్తి లింగయ్యకు పబ్లిగ్గానే వార్నింగ్ ఇచ్చిన వేముల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More