Home> టెక్నాలజీ
Advertisement

Woman Swallowed Apple AirPod: విటమిన్ టాబ్లెట్ అనుకుని యాపిల్ ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ

Woman Swallowed Apple AirPod, See What Happened Next: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన తన్నా బార్కర్ అనే మహిళ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అందుకు కారణం ఆమె విటమిన్ టాబ్లెట్ అనుకుని పొరపాటున యాపిల్ ఐపాడ్ మింగేయడమే.

Woman Swallowed Apple AirPod: విటమిన్ టాబ్లెట్ అనుకుని యాపిల్ ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ

Woman Swallowed Apple AirPod, See What Happened Next: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన తన్నా బార్కర్ అనే మహిళ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అందుకు కారణం ఆమె విటమిన్ టాబ్లెట్ అనుకుని పొరపాటున యాపిల్ ఐపాడ్ మింగేయడమే. ఔను.. ఈ విషయం తనే స్వయంగా టిక్ టాక్ వీడియో ద్వారా వెల్లడించింది. విటమిన్ టాబ్లెట్ అనుకుని పొరపాటున యాపిల్ ఎయిర్ పాడ్ మింగేశానని.. చేతిలో విటమిన్ టాబ్లెట్ అలాగే ఉండటం చూశాక కానీ తాను మింగింది విటమిన్ టాబ్లెట్ కాదు.. యాపిల్ ఎయిర్ పాడ్ అనే విషయం బోధపడలేదు అంటూ టన్నా బార్కర్ టిక్ టాక్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ తరువాతే అసలు విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. 

తన్నా బార్కర్ చెప్పిన స్టోరీ విన్నాకా ఆమె మాత్రమే కాదు.. నెటిజెన్స్ సైతం ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి ? అలాగే ఆమె కడుపులో ఉన్న యాపిల్ ఎయిర్ పాడ్ పరిస్థితి ఏంటి అనే ఆలోచన నెటిజెన్స్ ని కామ్ గా ఉండనివ్వడం లేదు. తరువాత ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఆ మహిళ కోసం ఎవ్వరికి తోచిన ఐడియాలు వాళ్లు ఇస్తున్నారు. 

అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన సమయలో తన్నా బార్కర్ తన ఫ్రెండ్‌తో కలిసి వాకింగ్‌కి వెళ్లింది. వాకింగ్ చేస్తుండగా చెవిలో యాపిల్ ఎయిర్ పాడ్ ఉండటం వల్ల తన ఫ్రెండ్ చెబుతున్న ముచ్చట సరిగ్గా వినపడటం లేదు అనే ఉద్దేశంతో చెవికి ఉన్న ఎయిర్ పాడ్ తీసి చేతిలో పట్టుకుంది. ఆ తరువాత వాకింగ్ మధ్యలో ఉండగానే తాను విటమిన్ పిల్స్ తీసుకోవాలి అనే విషయం గుర్తుకొచ్చి వ్యాలెట్ లో ఉన్న విటమిన్ టాబ్లెట్ తీసుకుంది. ఫ్రెండుతో మాట్లాడుతూనే చేతిలో ఉన్న యాపిల్ ఎయిర్ పాడ్‌ని విటమిన్ టాబ్లెట్ అని పొరపడి మింగేసింది. ఆ తరువాత కొద్దిసేపటికి చేతిలో చూసుకుంటే విటమిన్ టాబ్లెట్ చేతిలో అలానే ఉంది కానీ చేతిలో ఉండాల్సిన యాపిల్ ఎయిర్ పాడ్ మాత్రం కనిపించలేదు. అప్పుడు కానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు.. " తాను మింగింది విటమిన్ టాబ్లెట్ కాదు.. ఎయిర్ పాడ్ " అని. ఎయిర్ పాడ్‌ని బయటికి కక్కేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. 

అసలు విషయం గుర్తించిన వెంటనే.. తనతో పాటు మాట్లాడుతున్న ఫ్రెండుకి గుడ్‌బై చెప్పి వెంటనే అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. ఆ తరువాత హాస్పిటల్‌కి పరుగెత్తింది. పలువురు డాక్టర్లు, స్నేహితులను సంప్రదించి అసలు చెప్పుకుంది. కానీ అందరూ ఆమెకు ఇచ్చిన ఉమ్మడి సలహా ఒక్కటే.. మల విసర్జనలో ఎయిర్ పాడ్ బయటికి వెళ్లిపోతుందని.. అప్పటి వరకు ఓపిగ్గా వేచిచూడమని చెప్పారని బార్కర్ తన స్టోరీని తనే టిక్ టాక్ వీడియోలో చెప్పుకొచ్చింది. దీంతో టిక్ టాక్‌లో ఇప్పుడు తన్నా బార్కర్ ఓవర్ నైట్ సెన్సేషన్ అయింది.

Read More