Home> టెక్నాలజీ
Advertisement

Vivo X100 Pro Price: యాపిల్‌ 15 Pro మించిన వీవో మొబైల్‌ రాబోతోంది..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Vivo X100 Pro Price: ప్రముఖ టెక్‌ కంపెనీ వీవో నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. విడుదల కాబోయే స్మార్ట్‌ ఫోన్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 Vivo X100 Pro Price: యాపిల్‌ 15 Pro మించిన వీవో మొబైల్‌ రాబోతోంది..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Vivo X100 Pro Price: ప్రముఖ టెక్‌ కంపెనీ వీవో నుంచి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్‌ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ Vivo X100 పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌ బేస్ వేరియంట్, ప్రో వేరియంట్ వేరియంట్స్‌లలో లభించునుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను కస్టమర్స్‌కు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందించబోతోంది. ఈ Vivo X100 మొబైల్‌కి సంబంధించిన విడుదల తేదిని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ పలువురు టెక్‌ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం, రాబోయే నవంబర్‌ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

టిప్‌స్టర్ పాండా ఈజ్ బాల్డ్ ప్రకారం.. నవంబర్ 13, 14 తేదిల్లో విడుదలయ్యే చేయోచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే విడుదలకు ముందే ఈ Vivo X100 స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ మొబైల్‌లో అనేక రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలైతే iPhone 15 Proతో పోటీ పడుతుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

Vivo X100 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల వివరాలు:
ఈ స్మార్ట్ ఫోన్‌ MediaTek ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా Dimensity 9300 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. Vivo X100 సిరీస్ ఫోన్లు నవంబర్ 3వ వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డైమెన్షన్ D9300తో కూడిన X100 సిరీస్  A17 ప్రో చిప్‌సెట్‌తో కూడిన Apple iPhone 15 Pro లాగా పని చేస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ యాపిల్ ఫోన్‌లో ఉన్న అన్ని రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ కొన్ని అధునాత ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది.   

ఫీచర్స్ వివరాలు:
5100mAh బ్యాటరీ
120 వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌
50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌
IMX663 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్
 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Read More