Home> టెక్నాలజీ
Advertisement

Valentine’s Day iPhone 14 Offer: 37,900కే ఐఫోన్ 14.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

Valentine’s Day 2023 Offer:  యాపిల్ కంపెనీ అధీకృత విక్రేత iవీనస్ ఐఫోన్ 14 ను చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది, అందుకే ఐఫోన్ 14ని స్టోర్‌లో రూ. 37,900 ధరకే కొనుగోలు చేయవచ్చు, ఎలాగో తెలుసా!

Valentine’s Day iPhone 14 Offer: 37,900కే ఐఫోన్ 14.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

iPhone 14 Valentine’s Day Offer: ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రేమికుల కోసం ఈ రోజున చాలా కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి. అయితే అవి ఫోన్ల విషయంలో కూడా ఉండడంతో అందరూ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  ఇక ఫోన్లలో మేటి ఐఫోన్, యాపిల్ సంస్థ 14 సిరీస్ గత ఏడాదిలో ప్రవేశ పెట్టింది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా, యాపిల్ కంపెనీ అధీకృత విక్రేత iవీనస్ ఐఫోన్ 14 ను చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 14ని స్టోర్‌లో రూ. 37,900 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం పదండి. 
iPhone 14 ఆఫర్‌:
ఐ ఫోన్ 14 ఒక్కటే కాదు iVenus స్టోర్‌లో ఐ ఫోన్ 14 ప్లస్, ఐ ఫోన్ 13, ఎయిర్ పాడ్స్ ప్రో, ఐపాడ్స్, మాక్ బుక్ వంటి వాటిపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఐ వీనస్ స్టోర్లు గుజరాత్ అలాగే మహారాష్ట్రలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు ఢిల్లీ ఎన్సీఆర్ లో నివాసం ఉంటున్నట్టు అయితే  మీరు ఐ ఫోన్ 14 సహా ఇతర మోడళ్లపై మంచి డీల్‌స్ కోసం ఇమాజిన్ స్టోర్‌ని చెక్ చేయచ్చు. 
ఐ ఫోన్ 14 కేవలం రూ. 37,900కే:
ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900, అయితే దాన్ని i వీనస్ స్టోర్ నుంచి రూ. 37,900 కే కొనుగోలు చేయవచ్చు. i వీనస్ స్టోర్ ఈ పరికరంపై రూ. 8000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది, అంతేకాదు మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డును ఉపయోగిస్తే, మీకు 4 వేల రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది.  ఇక మీ పాత ఫోన్ కనుక ఎక్స్ ఛేంజ్ చేయాలనుకుంటే రూ. 22,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా మీకు లభిస్తుంది. అలా ఇన్ని ఆఫర్లు మీకు అప్లికబుల్ అయితే మీ ఫోన్ ధర రూ. 37,900కే లభించవచ్చు.  

ఒకరకంగా చెప్పలాంటే మీరు ఐఫోన్ 14ను రూ. 40,000 కంటే తక్కువ ధరకు పొందినట్లయితే, ఇంతకంటే మెరుగైన డీల్‌ను మీరు ఎక్కడా పొందలేరనే చెప్పాలీ. ఒక సారి ఐఫోన్ స్పెసిఫికేషన్స్ కనుక మనం పరిశీలిస్తే 14 60hz రిఫ్రెష్ రేట్‌తో, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తోంది. అలాగే ఈ ఫోన్ 1200-నిట్స్ బ్రైట్‌నెస్, ఫేస్ ఐడి సెన్సార్‌తో మన ముందుకు వస్తుంది. ఇక ఈ ఐఫోన్ 14కు పవర్ అందించేది A15 బయోనిక్ చిప్ కాగా అందులో 16-కోర్ NPU మరియు 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉన్నాయి. ఇక ఈ ఫోన్ తాజా iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుండగా ఈ ఐఫోన్ 14 డ్యూయల్ రేర్ కెమెరాలను కలిగి ఉండడం గమనార్హం. ఇక సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో కూడిన ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ వీడియో రికార్డింగ్ డాల్బీ విజన్‌ కూడా ఉంటుంది. 

Also Read: Best Jio Recharge Plan 2023: జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌.. 388 రోజుల వాలిడిటీ! డేటాను అస్సలు పూర్తిచేయలేరు

Also Read: Tips to Buy Cars: కార్ల కొనుగోలుకు ముందు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలివే, ఎందులో ఎక్కువ సౌకర్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
Read More